News August 8, 2024
రిలయన్స్ నుంచి 42వేల మంది ఉద్యోగులు ఔట్

దేశంలో అతిపెద్ద సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక్క ఏడాదిలో (2023-24) ఏకంగా 42వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఖర్చులు పెరగకుండా ఉండేందుకు రిటైల్ రంగంలో నియామకాలను సైతం తగ్గించింది. దీంతో ఉద్యోగుల సంఖ్య 3,89,000 నుంచి FY24లో 3,47,000కు చేరింది. కొందరు రిజైన్ చేస్తే మరికొందరిని కంపెనీ తొలగించింది.
Similar News
News March 12, 2026
అనంతపురం జిల్లాకు 24వ ర్యాంకు

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు జిల్లాల వారీగా ర్యాంకులు ప్రకటించారు. సంక్షేమ పథకాలు, అధికారుల పనితీరుపై అనంతపురం జిల్లా రాష్ట్రస్థాయిలో 24వ స్థానంలో నిలిచింది. జిల్లాలో ప్రజల సంతృప్తి స్థాయి 64.6 నుంచి 66.6 శాతానికి పెరిగింది. పనితీరులో మరింత పురోగతి సాధించి మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
News March 12, 2026
పారిశ్రామిక హబ్‌గా ఏపీ: సీఎం చంద్రబాబు

AP: వైసీపీ ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఉన్న కంపెనీలు కూడా పారిపోయే పరిస్థితి చూశామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ ‘అభివృద్ధి కోసం ఏ చిన్న ప్రయత్నం చేసినా దీర్ఘకాలంలో వాటి ఫలితాలను చూస్తాం’ అని పేర్కొన్నారు.
News March 12, 2026
ఫరూఖ్‌ను 20 ఏళ్లుగా చంపాలనుకుంటున్నా: నిందితుడు

J&K మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లాపై <<19359185>>హత్యాయత్నం<<>> చేసిన కమల్ సింగ్ పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. ‘ఫరూఖ్‌ను చంపాలని 20 ఏళ్లుగా అనుకుంటున్నా. ఇది నా పర్సనల్ అజెండా. ఇవాళ నాకు అవకాశం వచ్చింది. కాల్పులు జరిపింది నా తుపాకీతోనే. అదృష్టంకొద్దీ బతికిపోయారు’ అని పేర్కొన్నాడు. మాజీ సీఎంను చంపే ప్రయత్నం ఎందుకు చేశాడనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


