News July 10, 2025

ఆర్టీసీలో 422 కొత్త బస్సులు

image

TG: ఆర్టీసీ కొత్తగా 422 బస్సులు ప్రవేశపెట్టనుంది. కాలం చెల్లిన బస్సుల స్థానంలో 294 పల్లె వెలుగులు, 88 మెట్రో డీలక్స్‌లు, 23 డీలక్స్‌లు, 17 ఎక్స్‌ప్రెస్‌లను తీసుకురానుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరగడంతో ప్రయాణికులకు రిలీఫ్ ఇచ్చేందుకు RTC ఈ నిర్ణయం తీసుకుంది. 13-15లక్షల కి.మీ. తిరిగిన లేదా 15 ఏళ్ల కాలం దాటిన బస్సులను ఆర్టీసీ పక్కనపెట్టనుంది.

Similar News

News July 11, 2025

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలివే!

image

AP: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు TTD వెల్లడించింది. ప్రతిరోజూ ఉ.8-10 గంటల వరకు, రా.7-9 గంటల వరకు వాహన సేవలు నిర్వహించనున్నారు.
ముఖ్యమైన తేదీలు..
* 16-09-2025 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, * 23-09-2025 బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, * 24-09-2025 ధ్వజారోహణం, * 28-09-2025 గరుడ వాహనం, * 01-10-2025 రథోత్సవం,
* 02-10-2025 చక్రస్నానం

News July 11, 2025

కానిస్టేబుల్ ఫైనల్ స్కోర్ కార్డ్ విడుదల

image

AP: పోలీస్ కానిస్టేబుల్ ఫైనల్ స్కోర్ కార్డు విడుదలైంది. 6,100 పోస్టులకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ జూన్‌ 1న తుది పరీక్ష నిర్వహించింది. 37,600 మంది పరీక్ష రాయగా, 33,921 మంది క్వాలిఫై అయ్యారు. 12వ తేదీలోపు రూ.1000 చెల్లించి OMR వెరిఫికేషన్‌కు రిక్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ <>క్లిక్<<>> చేసి స్కోర్ తెలుసుకోండి. కటాఫ్, ఫైనల్ రిజల్ట్స్‌ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

News July 11, 2025

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కవిత

image

TG: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని BRS MLC కవిత ట్వీట్ చేశారు. ఇది పూర్తిగా రాష్ట్ర బీసీలు, తెలంగాణ జాగృతి సాధించిన విజయమని అభివర్ణించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు అంశంపై కాలయాపన చేయకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.