News June 22, 2024

ఐదేళ్లలో 43 పేపర్లు లీక్: ప్రియాంకా గాంధీ

image

BJP పాలనలో పరీక్షల పేపర్ లీకేజీలు జాతీయ సమస్యగా మారాయని INC నేత ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. ఐదేళ్లలో ఏకంగా 43 పేర్లు లీకయ్యాయని ఆరోపించారు. కోట్లాది మంది యువత భవిష్యత్తును కమలం పార్టీ నాశనం చేసిందని విమర్శించారు. ‘వివిధ రకాల పరీక్షల కోసం రేయింబవళ్లు యువత కష్టపడుతోంది. తల్లిదండ్రులు అన్నీ త్యాగం చేసి వారి కోసమే బతుకుతున్నారు. పరీక్షల్లో అవకతవకలతో విద్యార్థుల శ్రమ వృథా అవుతోంది’ అని ఫైరయ్యారు.

Similar News

News December 8, 2025

విమానాల రద్దు.. ఇండిగో షేర్లు భారీగా పతనం

image

ఇండిగో(ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌) షేర్లు ఇవాళ ట్రేడింగ్‌లో భారీగా పతనమయ్యాయి. సెషన్ ప్రారంభంలో ఏకంగా 7 శాతం నష్టపోయాయి. తర్వాత కాస్త ఎగసినా మళ్లీ డౌన్ అయ్యాయి. ప్రస్తుతం 406 పాయింట్లు కోల్పోయి(7.6 శాతం) 4,964 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. గత 5 రోజుల్లో ఏకంగా 14 శాతం మేర నష్టపోయాయి. వారం రోజులుగా ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు షేర్లను అమ్మేస్తున్నారు.

News December 8, 2025

వరి పంటకు పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారా?

image

వరి పిలకల దశలో యూరియాతో పాటు చాలా మంది రైతులు DAP, 20-20-0 వంటి కాంప్లెక్స్ ఎరువులను ఎకరాకు ఒక బస్తా చొప్పున వేస్తుంటారు. ఈ కాంప్లెక్స్ ఎరువులలో ఉండే భాస్వరం కేవలం 20 నుంచి 25 శాతమే మొక్కలకు అందుతుంది. మిగతాది అంతా భూమిలో మొక్కలకు అందని స్థితిలో మారిపోతుంది. దీనికి బదులు ‘నానో డీఏపీ’ని ఎకరాకు అర లీటరు స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News December 8, 2025

మావోయిస్టు కీలక నేత లొంగుబాటు.. MMCలో ఉద్యమం అంతం!

image

మావోయిస్టు పార్టీ కీలక నేత రామ్‌ధేర్ మజ్జీ సహా 12 మంది ఛత్తీస్‌గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. రామ్‌ధేర్ మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ (MMC) జోన్‌‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఇతడిపై రూ.3 కోట్ల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. రామ్‌ధేర్ లొంగుబాటుతో MMC జోన్‌లో మావోయిజం అంతమైనట్లేనని భావిస్తున్నారు.