News March 29, 2025

43 వసంతాల ‘తెలుగుదేశం’

image

తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్టీఆర్ 1982 మార్చి 29న టీడీపీని స్థాపించారు. 9 నెలల్లోనే 294 అసెంబ్లీ సీట్లలో 202 గెలుచుకుని పార్టీ అధికారంలోకి వచ్చింది. రూ.2కే కిలో బియ్యం, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు వంటి కొత్త పథకాలతో పలు సంస్కరణలు తీసుకొచ్చింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు పది సార్లు ఎన్నికలు జరగగా.. ఆరు సార్లు అధికారంలో, నాలుగు సార్లు ప్రతిపక్షంలో ఉంది.

Similar News

News September 14, 2025

కాంగ్రెస్ వల్లే విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి: హరీశ్ రావు

image

TG: రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడం సిగ్గుచేటని BRS MLA హరీశ్ రావు ఫైరయ్యారు. కాంగ్రెస్ నిర్లక్ష్యంతో విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి నెలకొందన్నారు. రీయింబర్స్‌మెంట్, ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా ప్రాజెక్టులకు ₹కోట్ల టెండర్లు ఎలా పిలుస్తున్నారని ప్రశ్నించారు. ఇలానే కొనసాగితే తక్కువ కాలంలో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించిన విద్యాశాఖ మంత్రిగానూ రేవంత్ నిలిచిపోతారన్నారు.

News September 14, 2025

రేపు డీఎస్సీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్

image

AP: డీఎస్సీ ఫైనల్ సెలక్షన్ లిస్టులను రేపు విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ తుది ఎంపిక జాబితాలు DEO, కలెక్టర్ కార్యాలయాల్లో, https://apdsc.apcfss.in/లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. కాగా ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన వారికి ఈ నెల 19న అమరావతిలో అపాయింట్‌మెంట్ లెటర్లను అందజేయనున్నారు. 16,347 ఉద్యోగాలకు ఈ ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.

News September 14, 2025

రేపు, ఎల్లుండి కలెక్టర్ల కాన్ఫరెన్స్

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రేపు, ఎల్లుండి కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. పౌరసేవలు, పథకాల అమలుపై జిల్లాల వారీగా జవాబుదారీతనం ఉండేలా ఈ కాన్ఫరెన్స్ జరుగుతుందని CM ఇప్పటికే వెల్లడించారు. తొలిరోజు వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల పురోగతితో పాటు సూపర్ సిక్స్ పథకాలు, అన్న క్యాంటీన్లు, P-4పై సమీక్షించనున్నారు. రెండో రోజు వైద్యం, క్వాంటం వ్యాలీ, మున్సిపల్, పంచాయతీరాజ్ అంశాలపై చర్చించనున్నారు.