News January 15, 2025
430 విజయాలు.. చరిత్ర సృష్టించిన జకోవిచ్

ఆస్ట్రేలియా ఓపెన్ మూడో రౌండ్‌కు చేరుకున్న సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్ చరిత్ర సృష్టించారు. ప్రొఫెషనల్ టెన్నిస్‌లో అత్యధిక మ్యాచ్‌లు(430) గెలిచిన ప్లేయర్‌గా ఘనత సాధించారు. గతంలో ఫెదరర్(429) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశారు. జకోవిచ్ ఇప్పటికే అత్యధిక గ్రాండ్‌స్లామ్(24)లను గెలిచిన ప్లేయర్‌గానూ కొనసాగుతున్నారు. ఇందులో 10 ఆస్ట్రేలియా ఓపెన్, 7 వింబుల్డన్, 4 యూఎస్ ఓపెన్, 3 ఫ్రెంచ్ ఓపెన్లు ఉన్నాయి.
Similar News
News January 22, 2026
చిరంజీవి మూవీ టికెట్ రేట్లు తగ్గింపు

AP: చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ టికెట్ రేట్స్ తగ్గాయి. ప్రభుత్వం తొలి 10రోజులు మల్టీప్లెక్సుల్లో రూ.120, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100 పెంచుకునే అనుమతి ఇచ్చింది. ఆ గడువు ముగియడంతో సాధారణ రేట్లకే టికెట్స్ అందుబాటులోకి వచ్చాయి. TGలోనూ టికెట్స్ నార్మల్ రేట్లకే అందుబాటులో ఉన్నాయి. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.300+ కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే.
News January 22, 2026
PM తర్వాత గంభీర్‌దే టఫ్ జాబ్: శశి థరూర్

నాగ్‌పూర్‌లో హెడ్ కోచ్ గంభీర్‌ను కలిసినట్లు MP శశి థరూర్ పేర్కొన్నారు. ‘నా ఓల్డ్ ఫ్రెండ్‌తో మంచి డిస్కషన్ చేశాను దేశంలో PM తర్వాత గంభీర్ అత్యంత కష్టమైన ఉద్యోగం చేస్తున్నారు. రోజూ లక్షలమంది విమర్శిస్తున్నా ధైర్యంగా నడుస్తున్నారు. ఆయనకు అన్ని విజయాలు చేకూరాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. గంభీర్ ఆయనకు థాంక్స్ చెప్పారు. పరిస్థితులు చక్కబడితే కోచ్ బాధ్యతలపై క్లారిటీ వస్తుందని ట్వీట్ చేశారు.
News January 22, 2026
EU దేశాలపై టారిఫ్స్ విధించట్లేదు: ట్రంప్

EU దేశాలపై విధించిన టారిఫ్స్ విషయంలో US అధ్యక్షుడు ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. ‘నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో భేటీ అయ్యాను. గ్రీన్లాండ్ సహా ఆర్కిటిక్ ప్రాంతానికి సంబంధించి ఫ్యూచర్ డీల్ ఫ్రేమ్ వర్క్ రెడీ చేశాం. దీంతో ఒక్క USకే కాదు అన్ని NATO దేశాలకు మంచి జరుగుతుంది. యూరప్ దేశాలపై టారిఫ్స్ విధించట్లేదు. గ్రీన్‌ల్యాండ్‌కు సంబంధించిన గోల్డెన్ డోమ్‌పై మరిన్ని చర్చలు జరుగుతాయి’ అని తెలిపారు.


