News January 14, 2025

44 నేషనల్ హైవేపై యాక్సిడెంట్ యువకుడి మృతి

image

బాల్కొండ మండలం చిట్టాపూర్ వద్ద నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి స్వగ్రామం నిర్మల్ జిల్లా బొప్పారం అని బాల్కొండ ఎస్ఐ నరేష్ తెలిపారు. పండగ వేళ తీవ్ర విషాదమని, అత్యంత వేగంగా వెళ్ళడమే ప్రమాదానికి కారణమని ఎస్ నరేష్, ఏఎస్ఐ శంకర్ తెలిపారు.

Similar News

News February 13, 2025

భీంపూర్‌‌లో చిరుత.. స్పందించిన అధికారులు

image

భీంపూర్ మండలంలోని నిపాని గ్రామ శివారులో చిరుత పులి కదలిక పై ఎఫ్ఎస్‌వో అహ్మద్ ఖాన్, ఎఫ్‌బీవో శ్రీనివాస్ స్పందించారు. నిపాని శివారులోని లింగారెడ్డి అనే రైతుకు చెందిన పంట చేనులో చిరుత పులి సంచారం సీసీ కెమెరాలో రికార్డయిందన్నారు. గురువారం పంట చేనుకు వెళ్లి పరిశీలించారు. రైతులెవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News February 13, 2025

ADB: వ్యక్తిపై లైంగిక దాడి కేసు

image

తనను ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు గురిచేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ADB 1 టౌన్ CI సునీల్ కుమార్ వివరాలు.. తల్లిగారింటి వద్ద ఉంటున్న ఓ వివాహిత(24), శాంతినగర్‌కి చెందిన షేక్ ఆసిఫ్‌ 8నెలల పాటు సహజీవనం చేశారు. కాగా తనను ఆసిఫ్ మోసం చేశాడని, లైంగికంగా వేధించి తన వీడియోలు తీశాడని బాధిత మహిళ ఆరోపించింది. ఆసిఫ్ తనను కులం పేరుతో దూషించాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం కేసు నమోదైంది.

News February 13, 2025

నిర్మల్‌: యువతి దారుణ హత్య.. నిందితుడికి జీవత ఖైదు

image

ఏడాది క్రితం ప్రేమ పేరుతో <<12630813>>యువతిని హత్య<<>> చేసిన వ్యక్తికి నిర్మల్ జిల్లా కోర్టు జీవితకాల శిక్ష, విధించింది. పోలీసులు వివరాలు.. ఖానాపూర్ అంబేడ్కర్ కాలనీకి చెందిన శ్రీకాంత్ అదే కాలనీకి చెందిన అలేఖ్యను ప్రేమ పేరుతో వేధించాడు. ఆమె నిరాకరించడంతో ద్వేషం పెంచుకున్నాడు. ఆమెకు వివాహం నిశ్చయం కావడంతో విషయం తెలుసుకున్న శ్రీకాంత్ 2024 ఫిబ్రవరి 8న ఆమెను కత్తితో నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశాడు.

error: Content is protected !!