News August 27, 2025
44 ఏళ్ల వయసులో టీచర్ ఉద్యోగం

పట్టుదల ఉంటే వయసుతో సంబంధం లేకుండా అనుకున్నది సాధించవచ్చని నిరూపించారు లక్ష్మీనారాయణ. సిరివెళ్ల మండలం వీరారెడ్డి పల్లెకు చెందిన లక్ష్మీనారాయణ 44 ఏళ్ల వయసులో తాజాగా విడుదలైన డీఎస్సీ ఫలితాలలో రెండు విభాగాలలో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. టీజీటీ హిందీ విభాగంలో 76.31 మార్కులతో 45 జోనల్ ర్యాంక్, ఎస్ఏ హిందీ విభాగంలో 69.31 మార్కులతో జిల్లా స్థాయి 65వ ర్యాంక్ సాధించినట్లు ఆయన తెలిపారు.
Similar News
News August 27, 2025
తాంసి : అధిక మద్యం తాగి మృతి

తాంసి మండలంలోని గొట్కూరిలో మద్యం మత్తు విషాదంగా మారింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. మడావి లక్ష్మణ్(48) సోమవారం రాత్రి స్నేహితులతో అధిక మద్యం తాగాడు. ఇంటికి వచ్చిన ఆయన అపస్మారక స్థితిలో పడిపోగా కుటుంబీకులు రిమ్స్‌కు తరలించారు. అప్పటికే మృతిచెందడంతో ఇంటికి వచ్చారు. మంగళవారం కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.
News August 27, 2025
సైబర్ నేరగాళ్ల వలలో పడి రూ. లక్ష పోగొట్టుకున్న విద్యార్థిని

ఏలూరు రూరల్ మండలం ప్రతి కోళ్ల లంక గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని జ్యోతి, సైబర్ నేరగాళ్ల వలలో చిక్కింది. వాట్సాప్‌లో వచ్చిన ఒక లింక్‌ను నమ్మి, డబ్బులు రెట్టింపు అవుతాయని భావించి ఆమె తన లక్ష రూపాయలను దఫదఫాలుగా పెట్టుబడి పెట్టి మోసపోయింది. ఈ ఘటనపై ఎస్ఐ నాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు ఇలాంటి లింకులను క్లిక్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
News August 27, 2025
కడప జిల్లా కలెక్టర్ పేరిట నకిలీ అకౌంట్లు

తన పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసినట్లు తన దృష్టికి వచ్చిందని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. తన ఫొటోలు వాడి ఇతరులను మోసం చేసేందుకు ప్రయత్నించే వారిపై చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇలాంటి ఫేక్ హ్యాకర్‌లపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ హెచ్చరించారు.