News January 14, 2025
44 నేషనల్ హైవేపై యాక్సిడెంట్ యువకుడి మృతి
బాల్కొండ మండలం చిట్టాపూర్ వద్ద నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి స్వగ్రామం నిర్మల్ జిల్లా బొప్పారం అని బాల్కొండ ఎస్ఐ నరేష్ తెలిపారు. పండగ వేళ తీవ్ర విషాదమని, అత్యంత వేగంగా వెళ్ళడమే ప్రమాదానికి కారణమని ఎస్ నరేష్, ఏఎస్ఐ శంకర్ తెలిపారు.
Similar News
News January 14, 2025
బెల్లంపల్లి: రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
సంక్రాంతి పండగపూట బెల్లంపల్లిలో విషాదం నెలకొంది. కాగజ్‌నగర్‌కు చెందిన రాజేశ్ HYDలో మెకానిక్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. టూ టౌన్ SI మహేందర్ కథనం ప్రకారం.. రాజేశ్ తన భార్య, కుమారుడితో కారులో మంగళవారం కాగజ్‌నగర్ వెళ్తున్నారు. బెల్లంపల్లి గంగారంనగర్ హైవేపై లారీని ఢీకొట్టాడు. ప్రమాదంలో అతడి భార్య రేణుక(30) అక్కడికక్కడే మరణించింది. తీవ్రగాయాలపాలైన రాజేశ్‌ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నాడు.
News January 14, 2025
జాతరకు రావాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఆహ్వానం
సారంగాపూర్ మండలం పొట్య గ్రామ పంచాయతీ పరిధిలోని బండ్రేవు తండాలో నాను మహరాజ్ జాతర ఉత్సవాలకు బీజేపీ శాసన సభ పక్ష నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి నాను మహారాజ్ జాతర ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణ, దావుజీ, ప్రకాష్,జాతర ఉత్సవ కమిటీ సభ్యులు బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
News January 14, 2025
భీమారం: రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల బాలిక దుర్మరణం
ఆంధ్రప్రదేశ్‌లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భీమారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నాలుగేళ్ల అద్వైకరాజ్ దుర్మరణం చెందింది. మంతెన రాజ్ కుమార్ తన భార్య సురేఖ, కుమార్తె అద్వైకరాజ్, తల్లి లక్ష్మమ్మ, మేనకోడలు తేజశ్రీతో కలిసి తమిళనాడులోని ఒక చర్చికి వెళ్లి సోమవారం తిరిగి వస్తుండగా కారు డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.