News January 30, 2025

 440 పోలింగ్ కేంద్రాలను సిద్ధం: కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కోసం 440 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్లు బుధవారం కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. 3 లక్షల 15 వేల 261 మంది పట్టభద్రులు ఓటర్లు ఉండగా, వీరిలో లక్షా 83 వేల 734 మంది పురుషులు, లక్షా 31 వేల 507 మంది మహిళలు, 20 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారన్నారు. నామినేషన్ల తుది తేదీ వరకు ఓటర్లుగా నమోదు అయ్యేందుకు దరఖాస్తు www.nvsp.in వెబ్‌సైట్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Similar News

News October 25, 2025

దశల వారీగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్తి చేస్తాం: కలెక్టర్

image

దశల వారీగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్తి చేస్తామని జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి, అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్, సంబంధిత శాఖల అధికారులతో కలిసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, ఆర్డీవోలు పాల్గొన్నారు.

News October 25, 2025

ANU: దూరవిద్య పీజీ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో జులై, ఆగస్టు మాసాలలో జరిగిన పలు పీజీ కోర్సుల పరీక్ష ఫలితాలను దూరవిద్య కేంద్రం డైరెక్టర్ వంకాయలపాటి వెంకటేశ్వర్లు శనివారం విడుదల చేశారు. ఎంఏ, ఎంకామ్, ఎంహెచ్ఆర్ 1 – 4 సెమిస్టర్లు, ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ మొదటి, ద్వితీయ, నాలుగో సెమిస్టర్లు, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ మొదటి, ద్వితీయ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు.

News October 25, 2025

రేపు కురుమూర్తి స్వామి ఆభరణాల ఊరేగింపు

image

శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాల భాగంగా ఆదివారం ఉదయం ఆత్మకూరు SBH బ్యాంకు వద్ద స్వామివారి ఆభరణాల పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. పూజ అనంతరం ఆభరణాలను ఊరేగింపుగా అమ్మాపూర్ సంస్థానాధీశులు రాజా శ్రీ రాంభూపాల్ నివాసానికి తీసుకెళ్లి సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి స్వామికి ఆభరణాల అలంకరణతో మొదటి పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.