News August 6, 2024
44,288 ఉద్యోగాలు.. ఎల్లుండి వరకే ఛాన్స్

దేశంలోని పోస్టాఫీసుల్లోని 44,288 పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. నేటి నుంచి AUG 8 వరకు అభ్యర్థులు దరఖాస్తుల్లో మార్పులు చేసుకోవచ్చు. ఉదయం సర్వర్‌లో లోపం కారణంగా <
Similar News
News November 28, 2025
MBNR: పల్లె పోరు.. ఈసారి ఏకగ్రీవం ఎన్నో?

పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా తమను సర్పంచ్ గా ఎన్నుకోవడానికి అభ్యర్థులు ఆయా గ్రామాల్లో మంతనాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 276 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇలాంటి పంచాయతీలకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తామనడంతో అభివృద్ధి చేస్తామంటూ మద్దతు కూడగడుతున్నారు. మరి ఈసారి ఆయా జిల్లాలో ఎన్ని పంచాయతీలు ఏకగ్రీవమవుతాయో వేచి చూడవలసిందే. ఇప్పటికే గ్రామాల్లో ఎన్నికల వాతావరణం ఏర్పడింది.
News November 28, 2025
BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌లో భారీగా ఉద్యోగాలు

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్‌లో వివిధ జోన్లలో 110 బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్/డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సేల్స్, మార్కెటింగ్ విభాగంలో పని అనుభవం ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తును ఇ- మెయిల్ ద్వారా careers@bobcaps.inకు పంపాలి. వెబ్‌సైట్: https://www.bobcaps.in/
News November 28, 2025
ఈ పురుగు యమ డేంజర్.. కుడితే అంతే..

AP: రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నల్లి తరహా ఉండే ఈ చిన్న పురుగు ఓరియంటియా సట్సుగముషి అనే బ్యాక్టీరియా రూపం. ఇది కుడితే చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. వారం తర్వాత జ్వరం, జలుబు, వణుకు, నీరసం, ఊపిరితిత్తుల సమస్యలు కనిపిస్తాయి. సకాలంలో వైద్యులను సంప్రదించకుంటే ప్లేట్‌లెట్స్ పడిపోవడం, మెదడు, తీవ్ర శ్వాస సంబంధిత సమస్యలు, వెన్నెముక ఇన్‌ఫెక్షన్ సోకుతాయి.


