News July 15, 2024

44,288 ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే ఎంపిక

image

ఇండియా పోస్టులో 44,288 ఉద్యోగాల భర్తీకి <<13634003>>దరఖాస్తుల<<>> స్వీకరణ కొనసాగుతోంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక ఉంటుంది. టెన్త్‌లో మ్యాథ్స్, ఇంగ్లీష్, స్థానిక భాషలో వచ్చిన మార్కుల ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. BPMకు రూ.12వేల నుంచి రూ.29,380, ABPM/డాక్ సేవక్‌కు రూ.10వేల నుంచి రూ.24,470గా నిర్ణయించారు. 18-40 ఏళ్లలోపు వారు అర్హులు. SC, STలకు ఐదేళ్లు, OBCలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయసులో సడలింపు ఉంది.

Similar News

News September 14, 2025

SLBC కూలి 200 రోజులైనా స్పందించని కేంద్రం: కేటీఆర్

image

TG: SLBC టన్నెల్ కూలి 200 రోజులైనా కేంద్రం స్పందించడం లేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇప్పటికీ బాధితులకు ఎలాంటి పరిహారం అందించలేదని ఎక్స్‌లో ఆరోపించారు. ‘కాళేశ్వరంలో చిన్నపాటి లోపాలకే హంగామా చేసిన కేంద్ర ప్రభుత్వం SLBC ఘటనపై ఒక్క బృందాన్ని కూడా పంపలేదు. చోటా భాయ్‌ను బడే భాయ్ కాపాడుతున్నారు. మేము ఈసారి అధికారంలోకి వస్తే బాధితులకు న్యాయం చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

News September 14, 2025

త్రుటిలో తప్పిన విమాన ప్రమాదం

image

లక్నో విమానాశ్రయంలో లక్నో- ఢిల్లీ ఇండిగో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎంపీ డింపుల్ యాదవ్‌తో పాటు 151 మంది ప్రయాణికులు ఉన్న విమానం టేకాఫ్ సమయంలో రన్‌వే మీద ఒక్కసారిగా స్లో అయింది. పైలట్ చాకచక్యంగా ఎమర్జెన్సీ బ్రేకులను ఉపయోగించి ఫ్లైట్‌ను రన్‌వే దాటకుండా ఆపారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

News September 14, 2025

శ్రీశైలం ప్రాజెక్ట్ తాజా సమాచారం

image

శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుండటంతో డ్యామ్ 7 గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు.
◆ ఇన్ ఫ్లో: 1,57,458 క్యూసెక్కులు
◆ అవుట్ ఫ్లో: 2,60,401 క్యూసెక్కులు (7 గేట్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా)
◆ ప్రస్తుతం డ్యామ్ నీటిమట్టం: 884.40 అడుగులు
◆ నీటి నిల్వ: 212.4385 టీఎంసీలు