News October 16, 2025

‘45 కేసుల్లో నిందితుడు.. రోడ్డు ప్రమాదంలో దొరికిపోయాడు’

image

పలు రాష్ట్రాల్లో దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను ఉరవకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. 10 రోజుల క్రితం విడపనకల్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తులలో ఒకరు అంతరాష్ట్ర నేరస్థుడు నాగిరెడ్డిగా పోలీసులు గుర్తించారు. కారులో రూ.3.50 లక్షల నగదు, వెండి ఆభరణాలు లభ్యం కావడంతో అనుమానంతో విచారణ చేపట్టారు. నాలుగు రాష్ట్రాల్లో 45 కేసుల్లో అతడు నిందితుడిగా ఉన్నాడన్నారు.

Similar News

News October 16, 2025

వనపర్తి: 24 గంటలు నమోదైన వర్షపాత వివరాలు

image

వనపర్తి జిల్లాలో ఉన్న 21 వర్షపాతం నమోదు కేంద్రాలలో గడిచిన 24 గంటలో నాలుగు కేంద్రాలలో వర్షపాతం నమోదయింది. అత్యధికంగా జానంపేటలో 15.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. శ్రీరంగాపురం 6.8 మిల్లీమీటర్లు, పెబ్బేరు 4.8 మిల్లీమీటర్లు, దగడలో 1.8 మిల్లీమీటర్లు, మిగతా 17 కేంద్రాలలో 0.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News October 16, 2025

ఇంటర్ విద్యార్థులు వివరాలు సరిచూసుకోవాలి: DIEO

image

ఆసిఫాబాద్ జిల్లాలోని ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తమ పూర్తి వివరాలను ఆన్‌లైన్ చెక్ లిస్టులతో సరిచూసుకోవాలని DIEO రాందాస్ అన్నారు. ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో ఈ సౌకర్యాన్ని కల్పించారని తెలిపారు. విద్యార్థులు https://tgbie.cgg.gov.in/svc.do లింక్ ద్వారా నేరుగా తమ వివరాలు, ఫొటో, సంతకం వంటివి పరిశీలించుకోవచ్చన్నారు. ఏవైనా తప్పులుంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.

News October 16, 2025

రాజోలి: బండేనక బండి సుంకేసులకు గండి

image

రాజోలిలోని సుంకేసుల నుంచి ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. బుధవారం ఎద్దుల బండ్లతో గంగమ్మ గుడి, పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో టిప్పర్ యజమానులు ఇసుక డంపులను ఏర్పాటు చేస్తున్నారని స్థానికులు తెలిపారు. రెవెన్యూ అధికారులు ఇటీవల అక్రమ ఇసుక నిల్వలను సీజ్ చేశారు. ఇసుక అక్రమ నిల్వలు ఏర్పాటు చేస్తున్న వారిపై పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.