News September 22, 2025
450కి పైగా ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా: కన్నబాబు

తుళ్లూరు స్కిల్ హబ్‌లో ఈ నెల 24న 5 ప్రముఖ కంపెనీలలో 450కి పైగా ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నామని CRDA కమిషనర్ కన్నబాబు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని APSSDC సౌజన్యంతో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. SSC, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీ.ఫార్మసీ పూర్తి చేసిన వారు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చన్నారు. ఎంపికైన అభ్యర్థులు అమరావతి, VJA, HYDలో పనిచేయాల్సి ఉంటుందన్నారు.
Similar News
News September 22, 2025
సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్

TG: గోదావరి నదిపై సమ్మక్కసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్‌తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. NOCకి అంగీకరిస్తున్నట్లు విష్ణుదేవ్ తెలిపారు. భూసేకరణ, నష్టపరిహారం భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. 6.7 టీఎంసీల సామర్థ్యంతో ములుగు జిల్లాలో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు.
News September 22, 2025
రోడ్లపై వ్యర్థాలు కనిపిస్తే చర్యలు: కలెక్టర్

జిల్లాలో పారిశుద్ధ్యంపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం తెలిపారు. అక్కడక్కడ ఎక్కువగా కొబ్బరి బొండాల చిప్పలు, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసిన దిబ్బలు ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. వాటిని తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేటట్లు పంచాయతీ సెక్రటరీలు చూడాలని డీపీఓను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయన్నారు. ప్రజలు పరిశుభ్రతా చర్యలు చేపట్టాలన్నారు.
News September 22, 2025
పెండింగ్ పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతున్నాయి: MP కావ్య

వరంగల్లో గత 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, కాంగ్రెస్ పాలనలో ఒక్కొక్కటిగా పూర్తి అవుతున్నాయని MP కడియం కావ్య అన్నారు. హనుమకొండలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి-సంక్షేమ పథకాలను రెండు కళ్లుగా ముందుకు నడిపిస్తోందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై వడ్డీలు కడుతూనే, కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిరంతరంగా అమలు చేస్తోందని అన్నారు.