News September 22, 2025
450కి పైగా ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా: కన్నబాబు

తుళ్లూరు స్కిల్ హబ్‌లో ఈ నెల 24న 5 ప్రముఖ కంపెనీలలో 450కి పైగా ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నామని CRDA కమిషనర్ కన్నబాబు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని APSSDC సౌజన్యంతో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. SSC, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీ.ఫార్మసీ పూర్తి చేసిన వారు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చన్నారు. ఎంపికైన అభ్యర్థులు అమరావతి, VJA, HYDలో పనిచేయాల్సి ఉంటుందన్నారు.
Similar News
News September 22, 2025
నంద్యాల: పీజీఆర్ఎస్‌కు 220 దరఖాస్తులు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో నిశితంగా పరిశీలించి సంతృప్త స్థాయిలో వేగవంతంగా, నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి 220 అర్జీలు స్వీకరించారు. అధికారులు అర్జీలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
News September 22, 2025
పెంచలకోనలో ప్రారంభమైన దసరా నవరాత్రి ఉత్సవాలు

రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో సోమవారం దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారు సౌభాగ్యలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దసరా నవరాత్రుల సందర్భంగా భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకొని ప్రసాదాలను స్వీకరించారు.
News September 22, 2025
HYD: రూ.2 కోట్లు పోగొట్టుకున్న మహిళ..!

ట్రేడింగ్ పేరిట వాట్సాప్ గ్రూపులో లింకు పంపి ఫేక్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పిన సైబర్ నేరగాళ్లు ఓ మహిళను బురిడీ కొట్టించారు. ట్రేడింగ్ ద్వారా లాభాలు వస్తాయని చెప్పడంతో HYD అల్వాల్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ వారిని నమ్మింది. పలు దఫాలుగా మహిళ ఏకంగా రూ.2 కోట్లు పోగొట్టుకున్నట్లుగా తెలిపింది. చేసేదేం లేక, మోసపోయానంటూ HYD సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పింది.