News June 26, 2024
కరాచీలో 4 రోజుల్లో 450 మంది మృతి

పాకిస్థాన్లోని కరాచీలో ఎండలు మరణ మృదంగం మోగిస్తున్నాయి. గత నాలుగు రోజుల్లో వడదెబ్బతో 450 మంది మరణించినట్లు స్థానిక NGO అధికారులు తెలిపారు. ప్రస్తుతం కరాచీలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చనిపోయినవారిలో అనేకమంది నిరాశ్రయులు, డ్రగ్స్ బానిసలేనని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున మరణాలతో మార్చురీల్లో మృతదేహాలు పేరుకుపోయాయని చెప్పారు.
Similar News
News October 16, 2025
50 ఏళ్ల వయసులో సింగర్ రెండో పెళ్లి!

సింగర్ రఘు దీక్షిత్ 50 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. సింగర్, ఫ్లూటిస్ట్ వారిజశ్రీ వేణుగోపాల్(34)ను ఈ నెలాఖరున ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. 2005లో డాన్సర్ మయూరి ఉపాధ్యాయతో ఆయనకు వివాహం జరగగా 2019లో విడాకులు తీసుకున్నారు. రఘు తెలుగులో శ్రీమంతుడు, S/O సత్యమూర్తి, జనతా గ్యారేజ్ వంటి సినిమాల్లో పాటలు పాడారు. కన్నడ, హిందీ, మలయాళ, తమిళ భాషల్లో పలు చిత్రాలకు సంగీతం అందించారు.
News October 16, 2025
వంట చేయకపోతేనే హ్యాపీగా ఉంటారట!.. హార్వర్డ్ స్టడీ

తమ భర్తల కోసం వంట చేసేవారితో పోల్చితే చేయని స్త్రీల వైవాహిక జీవితమే సంతోషంగా ఉన్నట్లు హార్వర్డ్ అధ్యయనం తెలిపింది. ‘మహిళ నిత్యం వంట చేయడం వల్ల ఆమె తెలియకుండానే సేవకురాలిగా మారిపోతుంది. దీనివల్ల భాగస్వామ్య భావన తగ్గి, వైవాహిక సంతృప్తి కూడా తగ్గుతుంది’అని అధ్యయనం పేర్కొంది. 15 ఏళ్లపాటు 12వేల విదేశీ జంటలపై సర్వే చేయగా వంట చేసేవారు వైవాహిక జీవితంపై 6.1/10 ఇస్తే చేయనివారు 8.4/10 మార్కులిచ్చారు.
News October 16, 2025
క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరు

TG: రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితం డిప్యూటీ సీఎం భట్టితో భేటీ అయిన సురేఖ.. సచివాలయానికి రాకుండా బయటకు వెళ్లిపోయారు. మిగతా మంత్రులందరూ హాజరయ్యారు. ఇటీవల నెలకొన్న <<18020734>>వివాదాలతో<<>> ఆమె మంత్రివర్గ సమావేశానికి దూరంగా ఉన్నట్లు సమాచారం.