News December 16, 2025

453 Asst Prof పోస్టుల భర్తీ కోసం సీఎంకు ఫైల్

image

TG: వర్సిటీల్లోని 453 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ కసరత్తు చేపట్టింది. ఇందుకు సంబంధించిన ఫైలును CM రేవంత్‌కు పంపింది. 12 వర్సిటీల్లో 1061 పోస్టులు ఖాళీ ఉండగా ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో కొన్ని భర్తీ అయ్యాయి. వాటిని మినహాయించి మిగతా ఖాళీలను భర్తీ చేయాలని అధికారులు నివేదించారు. సీఎం ఆమోదించిన వెంటనే నోటిఫికేషన్ ఇస్తామని పేర్కొన్నారు. కాగా ఎక్కువ ఖాళీలు OUలోనే ఉన్నాయి.

Similar News

News December 18, 2025

పౌరసత్వం వదులుకుంటున్న భారతీయులు

image

భారత పౌరసత్వాన్ని వదులుకుని విదేశాలకు వెళ్లే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. గత ఐదేళ్లలో దాదాపు 9 లక్షల మంది భారతీయులు పౌరసత్వం వదులుకున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. 2022 నుంచి ఏడాదికి 2లక్షలకు పైగా భారతీయులు దేశాన్ని వీడారు. వీరిలో సంపన్నులు, నిపుణులు, మేధావులు ఎక్కువగా ఈ జాబితాలో ఉండటం గమనార్హం. ప్రపంచంలోనే అత్యధిక పౌరులను కోల్పోతున్న దేశాల్లో భారత్ టాప్‌లో కొనసాగుతోంది.

News December 18, 2025

మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ రివీల్: లోకేశ్

image

AP: మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘పాలనా సంస్కరణలు నినాదాలను మించినవైతే గుర్తింపు తప్పకుండా వస్తుంది. అత్యంత గౌరవనీయమైన అవార్డు.. బలమైన జ్యూరీ. అది ఏ అవార్డు? ఎవరు గెలుచుకున్నారో ఊహించండి. మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ రివీల్’ అని పేర్కొన్నారు. CM చంద్రబాబుకు ఎకనమిక్ టైమ్స్ ప్రకటించిన ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు గురించే లోకేశ్ చెబుతున్నారని నెటిజన్లు అంచనా వేస్తున్నారు.

News December 18, 2025

ESIC హాస్పిటల్‌లో ఉద్యోగాలు

image

<>ESIC<<>>, హాస్పిటల్ నోయిడా 21 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు DEC 24న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి MD, MS, DNB, M.Ch, DrNB, DM, MSc, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రొఫెసర్‌కు నెలకు రూ.2,22,543, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,47,986, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1,27,141 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. SC, ST, PwBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://esic.gov.in