News September 5, 2025
IBలో 455 ఉద్యోగాలు

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 455 సెక్యూరిటీ అసిస్టెంట్(మోటార్ ట్రాన్స్‌పోర్ట్) ఉద్యోగాలకు ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్ ఉత్తీర్ణతతోపాటు డ్రైవింగ్ లైసెన్స్, ఒక ఏడాది అనుభవం, మోటార్ మెకానిజం పరిజ్ఞానం ఉన్నవారు అర్హులు. 18-27ఏళ్ల వయసుండాలి. ఆన్‌లైన్ ఎగ్జామ్, డ్రైవింగ్ టెస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 ఉంటుంది.
వెబ్‌సైట్: https://www.ncs.gov.in/
Similar News
News September 5, 2025
హైదరాబాద్ వల్లే తెలంగాణ నంబర్‌వన్: చంద్రబాబు

AP: ఎంతో ఇష్టంతో తాను HYDను అభివృద్ధి చేశానని, దాని వల్లే TG నంబర్‌వన్‌గా నిలిచిందని CM చంద్రబాబు అన్నారు. అలాగే దేశంలో ఏపీని నంబర్‌వన్‌గా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో జరుగుతున్న టీచర్స్ డే కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ‘ప్రపంచంలోనే తెలుగుజాతి నంబర్‌వన్‌గా నిలవాలి. రాబోయే 22 ఏళ్లపాటు మనమంతా దీనిపై దృష్టి సారిస్తే సాధ్యమే. విజన్ 2047 కోసం శ్రమిద్దాం’ అని ఆయన పిలుపునిచ్చారు.
News September 5, 2025
అందుకే VRO, VRAలను BRS తొలగించింది: CM రేవంత్

TG: ధరణి పేరిట ధన, భూదాహంతో BRS ప్రభుత్వం భూములన్నీ చెరబట్టిందని CM రేవంత్ విమర్శించారు. తమ దుర్మార్గాలు ప్రజలకు తెలియకూడదనే VRO, VRAలను తొలగించారన్నారు. ఎన్నికల ముందు ఎవరిని కదిలించినా ధరణి గురించే చెప్పేవారని, అందుకే దాన్ని బంగాళాఖాతంలో పడేస్తామన్న హామీని నెరవేర్చినట్లు చెప్పారు. ధరణితో పట్టుకున్న దరిద్రాన్ని భూభారతితో తొలగిస్తున్నామని GPO నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో అన్నారు.
News September 5, 2025
70 కేసులు వేసినా డీఎస్సీ ఆగలేదు: లోకేశ్

AP: ఇప్పుడున్న ఉపాధ్యాయుల్లో దాదాపు 80% మందిని CM చంద్రబాబే నియమించి ఉంటారని మంత్రి లోకేశ్ అన్నారు. ‘DSC అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే DSC. 13 DSCల ద్వారా 1.80లక్షల మంది టీచర్లను చంద్రబాబే నియమించారు. 70 కేసులు వేసినా డీఎస్సీ మాత్రం ఆగలేదు. గత ప్రభుత్వంలో విచిత్రమైన పాలన చూశాం. ఉపాధ్యాయులను వైన్ షాపుల ముందు కాపలా పెట్టారు. జీతాలు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి’ అని లోకేశ్ ధ్వజమెత్తారు.