News March 29, 2024

రాష్ట్రంలో 4,590 బ్యాక్‌లాగ్ పోస్టులు!

image

TG: ఒకేసారి భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టడం, ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు మిగతా జాబ్స్‌ను వదిలేస్తుండటంతో బ్యాక్‌లాగ్ పోస్టులు పెరిగిపోతున్నాయి. 3 నెలల్లో 33వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరగగా, 4,590 పోస్టులు మిగిలిపోయినట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్ 2వేలు, గురుకులాల్లో 1,810, స్టాఫ్ నర్స్, మెడికల్ ఆఫీసర్లలో 780 ఉద్యోగాలు భర్తీ కాలేదు. వీటికోసం మళ్లీ నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంది.

Similar News

News January 22, 2026

Republic day Special: మేడం బికాజీ కామా

image

బొంబాయిలో పార్శీ కుటుంబంలో జన్మించిన బికాజీ కామా దాదాభాయ్‌ నౌరోజీ, శ్యాంజీ కృష్ణవర్మల ప్రేరణతో స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. ప్లేగు వ్యాధి చికిత్స కోసం లండన్‌ వెళ్లి అక్కడ భారతదేశ విప్లవకారులకు మార్గదర్శిగా మారారు. ‘ఫ్రీ ఇండియా సొసైటీ’ని స్థాపించారు. ‘వందేమాతరం’ పత్రికను నడిపారు. 1907లో జర్మనీలో మొదటిసారిగా భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈమెను ‘భారత విప్లవకారుల మాత’గా అభివర్ణిస్తారు.

News January 22, 2026

OTTలోకి కొత్త సినిమాలు

image

ఇటీవల థియేటర్లలో విడుదలైన పలు కొత్త సినిమాలు ఈరోజు అర్ధరాత్రి నుంచి OTTలోకి రానున్నాయి. ధనుష్, కృతిసనన్ నటించిన ‘తేరే ఇష్క్ మే’ (తెలుగులో అమరకావ్యం) నెట్‌ఫ్లిక్స్‌లో, కిచ్చా సుదీప్ ‘మార్క్’ జియో హాట్‌స్టార్‌లో, శివరాజ్ కుమార్, ఉపేంద్ర నటించిన ’45’ మూవీ ZEE5లో స్ట్రీమింగ్‌ కానున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో శోభితా ధూళిపాళ్ల ‘చీకటిలో’ రానుంది. ఇదే ప్లాట్‌ఫామ్‌లో ‘మోగ్లీ’ అందుబాటులోకి వచ్చింది.

News January 22, 2026

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు నోటీసులు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మరింత దూకుడు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్‌కు 160 CRPC కింద నోటీసులు జారీ చేసింది. నందినగర్‌లోని ఆయన ఇంటికి నోటీసులు పంపింది. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. కాగా రెండు రోజుల క్రితమే మాజీ మంత్రి హరీశ్ రావును సిట్ 7 గంటల పాటు విచారించింది.