News February 19, 2025
46 మంది టీడీపీ నేతలపై కేసు కొట్టివేత: ఎస్ఐ సతీశ్

మాచవరం మండలం తురకపాలెం తెలుగుదేశం పార్టీ వర్గీయులపై నమోదైన హత్య కేసును గురజాల అసిస్టెంట్ సెషన్ కోర్టు జడ్జి శ్రీనివాసరావు కొట్టివేశారని మాచవరం ఎస్ఐ సతీశ్ తెలిపారు. 2019 జూలై 1న తురకపాలెం గ్రామంలో మధ్యాహ్న భోజన పథకం విషయంలో ఘర్షణ జరిగింది. టీడీపీ వర్గీయులైన షేక్ అల్లావుద్దీన్‌తో పాటు 46 మందిపై అప్పట్లో కేసు నమోదు అయింది. సరైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసును కొట్టివేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
Similar News
News February 25, 2026
సీఎం పర్యటనలో అలసత్వం వద్దు: హోంమంత్రి అనిత

పెన్షన్‌ల పంపిణీ కార్యక్రమానికి CM చంద్రబాబు ఈనెల 28న రావివలస రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు రేపటి సాయంత్రానికల్లా పూర్తి చేయాలని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. అమరావతి నుంచి VC ద్వారా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి, తదితరులతో సమీక్షించారు. పారిశుధ్యం, భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటు పక్కాగా చేయాలని, విధుల్లో అలసత్వం వహించవద్దని సూచించారు.
News February 25, 2026
నాగర్‌కర్నూల్: క్రీడా పాఠశాల 4వ తరగతి ప్రవేశాల దరఖాస్తులు ప్రారంభం

రాష్ట్రంలోని ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి నాలుగో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి వి.సీతారాం తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4 వరకు గడువు నిర్ణయించారు. హకీంపేట్ క్రీడా పాఠశాలలో 10 మంది బాలురు, 10 మంది బాలికలకు ప్రవేశం కల్పిస్తామని, జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఎంపిక పోటీలు ఉంటాయన్నారు.
News February 25, 2026
జగిత్యాల: ‘ఆరోగ్య, భీమా పథకాలు ఆగకుండా చూడాలి’

ప్రభుత్వం ప్రకటించిన ఆరోగ్య, భీమా పథకాలు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగాలని సీనియర్ సిటిజన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ కోరారు. తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ జిల్లా సమావేశంలో మాట్లాడుతూ.. భీమా వయోపరిమితిని 70 ఏళ్లకు పెంచాలని, పెండింగ్ డీఏలు, బకాయిలు విడుదల చేసి పీఆర్‌సీ ప్రకటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య పథకానికి ఈపీహెచ్‌ఎస్ పేరు పెట్టాలని సూచించారు.


