News February 19, 2025

46 మంది టీడీపీ నేతలపై కేసు కొట్టివేత: ఎస్ఐ సతీశ్ 

image

మాచవరం మండలం తురకపాలెం తెలుగుదేశం పార్టీ వర్గీయులపై నమోదైన హత్య కేసును గురజాల అసిస్టెంట్ సెషన్ కోర్టు జడ్జి శ్రీనివాసరావు కొట్టివేశారని మాచవరం ఎస్ఐ సతీశ్ తెలిపారు. 2019 జూలై 1న తురకపాలెం గ్రామంలో మధ్యాహ్న భోజన పథకం విషయంలో ఘర్షణ జరిగింది. టీడీపీ వర్గీయులైన షేక్ అల్లావుద్దీన్‌తో పాటు 46 మందిపై అప్పట్లో కేసు నమోదు అయింది. సరైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసును కొట్టివేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 

Similar News

News March 24, 2025

పోలీస్ గ్రీవెన్స్ డేకు 30 మంది ఆర్జీదారులు: SP

image

ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో బాగంగా ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 30 మంది అర్జీదారులతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు.

News March 24, 2025

నంద్యాల జిల్లాలో TODAY TOP NEWS

image

☞ దారులన్నీ మల్లన్న వైపే.! ☞ అవుకులో క్షుద్ర పూజల కలకలం ☞ నందవరంలో మహిళ వీడియో తీసిన వ్యక్తిపై కేసు నమోదు ☞ బండి ఆత్మకూరులో హత్య కేసులో నలుగురు అరెస్ట్ ☞ కోడుమూరులో విద్యార్థిని చితకబాదిన సీనియర్ ☞ పెద్ద కందుకూరు మెట్ట వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం ☞ PGRSకు 62 ఫిర్యాదులు: ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ☞ కూటమితోనే రాష్ట్రాభివృద్ధి: డోన్ ఎమ్మెల్యే

News March 24, 2025

ఏపీ విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తీర్చి దిద్దాలి: లోకేశ్

image

ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటుకు జార్జియా నేషనల్ యూనివర్సిటీ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం మంత్రి లోకేశ్ సమక్షంలో GNU, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చెందడంతో పాటు 500 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి తెలిపారు. ఏపీ విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దాలన్నారు.

error: Content is protected !!