News September 23, 2025
CELలో 46 పోస్టులు

ఘజియాబాద్‌లోని సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(CEL) 46 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి టెన్త్, ITI, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు ఈ నెల 25వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 40 ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.500. ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.celindia.co.in/
Similar News
News September 23, 2025
మరో 2 గంటల్లో వర్షం

తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. నిన్న <<17794672>>హైదరాబాద్<<>> సహా పలు జిల్లాల్లో వాన దంచికొట్టిన విషయం తెలిసిందే. ఇవాళ కూడా కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తెలిపింది. మేడ్చల్, వరంగల్, ఆదిలాబాద్, హన్మకొండ, మహబూబాబాద్, నిర్మల్, సూర్యాపేట జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో మోస్తరు వాన పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. మీ ఏరియాలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.
News September 23, 2025
ఈనెల 26 వరకు వర్షాలే వర్షాలు!

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గతంలో మాదిరి కాకుండా క్లౌడ్ బరస్ట్ తరహాలో వానలు పడుతున్నాయి. అయితే ఈ వర్షాలు ఇప్పట్లో వీడే అవకాశం లేదని APSDMA తెలిపింది. పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఈనెల 26న వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో AP, TGలో మరో 3(26 వరకు) రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News September 23, 2025
వంటింటి చిట్కాలు మీ కోసం..

* గార్లిక్ బ్రెడ్ అందుబాటులో లేనప్పుడు కొన్ని వెల్లుల్లి రేకలను మెత్తగా చేసుకొని ఓ గంటపాటు పెరుగులో నానబెట్టాలి. తరువాత దాన్ని బ్రెడ్ స్లైసుల మీద పరిచి టోస్ట్ చేస్తే సరిపోతుంది.
* కూరల్లో గ్రేవీ పలుచగా అయినప్పుడు కాస్త మొక్కజొన్న పిండి కలిపితే గట్టిపడుతుంది.
* మాంసాన్ని సన్నని స్లైసుల్లా తరగాలనుకుంటే, దానిని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి, చాకుతో కోస్తే ఈజీగా వస్తాయి.