News September 4, 2024

స్వీపర్ పోస్టులకు 46వేల మంది గ్రాడ్యుయేట్స్ దరఖాస్తు

image

నిరుద్యోగ తీవ్రతను తెలిపే ఘటన హరియాణాలో జరిగింది. ₹15వేల జీతంతో పలు స్వీపర్ పోస్టులకు నోటిఫికేషన్ రాగా 6000 మంది PG, 40,000 మంది డిగ్రీ అభ్యర్థులు, 12 వరకు చదివిన 1.2లక్షల మంది అప్లై చేశారు. స్వీపర్‌గా చేరితే భవిష్యత్తులో ఉద్యోగం పర్మినెంట్ అయ్యే అవకాశం ఉందని కొందరంటే, ఆర్థిక సమస్యలతో దరఖాస్తు చేసుకున్నట్లు మరికొందరు చెప్పారు. ప్రైవేటులో జీతం ₹10K ఇస్తున్నారని, ఇక్కడైతే ₹15K అని ఇంకొందరన్నారు.

Similar News

News December 19, 2025

వరి కోత సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

image

వరి కోతల సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వరి వెన్నులో 80-90 శాతం గింజలు పసుపు రంగుకు మారుతున్నప్పుడు కర్ర పచ్చి మీద పంటను కోయాలి. పంట పక్వానికి వచ్చిన తర్వాత ఎక్కువ కాలం చేను మీద ఉంటే దిగుబడి తగ్గడంతోపాటు, గింజలపై పగుళ్లు ఏర్పడతాయి. గింజలలో తేమ తగ్గించడానికి 4-5 రోజులు చేనుపైనే ఎండనివ్వాలి. పనలను తిరగదిప్పితే సమానంగా ఎండుతాయి. పంటను ముందుగా కోస్తే ధాన్యంలో పచ్చి గింజలు ఎక్కువగా ఉంటాయి.

News December 19, 2025

గ్రామ పంచాయతీలకు నిధులు ఎలా వస్తాయంటే?

image

GPలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ల ద్వారా నిధులు వస్తాయి. కేంద్రం ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీల ఖాతాల్లో జనాభా ప్రాతిపదికన నిధులు జమచేస్తుంది. ఈ నిధులు GP పేరు మీద ఉన్న జాయింట్ ఖాతాలో జమ అవుతాయి. ఉపాధి హామీ, తాగునీటి పథకాలు, స్కూల్ డెవలప్‌మెంట్, మరుగుదొడ్ల నిర్మాణం వంటి వాటికి ప్రత్యేక నిధులు కేటాయిస్తారు. దీంతో పాటు ఇంటి, కుళాయి పన్నులు, మార్కెట్ ఫీజులు, చెరువుల వేలం ద్వారా ఆదాయం వస్తుంది.

News December 19, 2025

ఉద్యోగుల్లో సమగ్రత లోపిస్తే సవాళ్లను అధిగమించలేం: ముర్ము

image

TG: ఉద్యోగుల ఎంపికలో నిజాయతీ, సమగ్రతలకు ప్రాధాన్యమివ్వాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము PSC ఛైర్మన్ల సదస్సులో సూచించారు. ‘నైపుణ్యాలు లేకున్నా శిక్షణ ద్వారా అధిగమించొచ్చు. కానీ ఉద్యోగుల్లో సమగ్రత లోపిస్తే ఎదురయ్యే సవాళ్లను అధిగమించడం సాధ్యం కాకపోవచ్చు. అవకాశాల్లోనే కాకుండా ఫలితాల్లోనూ సమానత్వం ఉండేలా చూడాలి’ అని పేర్కొన్నారు. అణగారిన వర్గాల కోసం పనిచేయాలన్న ఆసక్తి ఉద్యోగుల్లో ఉండాలన్నారు.