News October 17, 2024
ఒకే ఓవర్లో 4,6,6,6,2

శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ20లో విండీస్ ప్లేయర్ మోతీ చెలరేగారు. వెల్లలగే వేసిన 15వ ఓవర్లో 3 సిక్సర్లు, ఒక ఫోర్ సాయంతో 24(4,6,6,6,2) రన్స్ బాదారు. మొత్తం 15 బంతులాడిన అతడు 32 రన్స్ చేశారు. దీంతో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన విండీస్ 20 ఓవర్లలో 162/8 రన్స్ చేసింది.
Similar News
News October 19, 2025
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక ధన్వంతరీ ఆలయం

తూ.గో. జిల్లాలోని చింతలూరు గ్రామంలో ధన్వంతరి స్వామి ఆలయం ఉంది. ఇక్కడ కాశీ ఏకశిలతో మలచిన పాలరాతి విగ్రహ రూపంలో స్వామివారు కొలువై ఉంటారు. నాలుగు చేతుల్లో శంఖం, చక్రం, అమృత కలశం, జలగ ధరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఆలయాన్ని దర్శిస్తే సమస్త రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడే కాకుండా శ్రీరంగం రంగనాథ ఆలయం, కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయం, కేరళలోని గురువాయూర్ సమీపంలో కూడా ధన్వంతరి ఆలయాలు ఉన్నాయి.
News October 19, 2025
ఎలాంటి గొర్రెలు కొంటే ఎక్కువ ప్రయోజనం?

ఆడ గొర్రెలు ఏడాదిన్నర వయసు, 8-10 కిలోల బరువు.. పొట్టేలు రెండేళ్ల వయసు, 10- 15 కిలోల బరువు ఉండాలి. రైతుల మంద నుంచి గొర్రెలు కొనడం మంచిది. రెండు ఈతలకు మధ్య ఎక్కువ సమయం తీసుకునే గొర్రెలు వద్దు. చూడి, మొదటిసారి ఈనిన గొర్రెలను కొంటే మంద పెరిగే ఛాన్సుంది. విత్తనపు పొట్టేలు, బలంగా, ఎత్తుగా ఉండి.. ఎక్కువ పిల్లలకు జన్మనిచ్చే సామర్థ్యంతో ఉండాలి. మందలో ప్రతీ 30 ఆడ గొర్రెలకు ఒక విత్తనపు పొట్టేలు ఉండాలి.
News October 19, 2025
కాల్పుల విరమణకు అంగీకరించిన పాకిస్థాన్, అఫ్గానిస్థాన్

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలకు తెరపడింది. తాజాగా దోహాలో జరిగిన చర్చల్లో ఇరు దేశాలు తక్షణమే సీజ్ ఫైర్కు అంగీకరించినట్లు ఖతర్ విదేశాంగ మంత్రి వెల్లడించారు. ఈ చర్యలు రాబోయే రోజుల్లో పాక్, అఫ్గాన్ సరిహద్దుల్లో శాంతి పునరుద్ధరణకు దోహదపడుతాయని పేర్కొన్నారు. కాగా ఈ చర్చలకు ఖతర్, తుర్కియే మధ్యవర్తిత్వం వహించాయి.