News September 12, 2025
47 ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూతో ఎంపిక

రాంచీలోని MECON లిమిటెడ్‌లో 47 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ విభాగాల్లో అడిషనల్ ఇంజినీర్, Dy.ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులున్నాయి. ఉద్యోగానుభంతోపాటు విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 15, 16, 19, 20వ తేదీల్లో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అప్లికేషన్ ఫామ్, ఇతర పూర్తి వివరాల కోసం <
Similar News
News March 12, 2026
రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు

TG: మండుతున్న ఎండలు, ఉక్కపోతకు ఉపశమనం కలిగించేలా రాష్ట్రంలో 2 రోజులు వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 15, 16 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మెదక్, హైదరాబాద్, మేడ్చల్, MBNR జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయని పేర్కొంది. అప్పటివరకు ఎండలు దంచి కొట్టనున్నాయని వెల్లడించింది.
News March 12, 2026
ఆయిల్ ధరలు పెరిగితే అమెరికాకే లాభం.. కానీ: ట్రంప్

క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే అమెరికాకే బెనిఫిట్ అని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు అని.. ధరలు పెరిగితే USకు భారీగా ఆదాయం వస్తుందన్నారు. కానీ అది తన ప్రాధాన్యం కాదన్నారు. న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకుండా, పశ్చిమాసియాతో పాటు ప్రపంచాన్ని నాశనం చేయకుండా ఇరాన్‌ను అడ్డుకోవడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.
News March 12, 2026
కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం!

AP: రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో(KGBV) ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 2026-27లో 352 స్కూళ్లలో 6, 11 తరగతుల్లో అడ్మిషన్లకు, 7, 8, 9, 10, 12 తరగతుల్లో ఖాళీ సీట్ల కోసం <


