News October 6, 2025
రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ వర్సిటీలో 47 పోస్టులు

రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ 47 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు నవంబర్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PhD, MBA, PGDM, CA, B.E, B.Tech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. వెబ్‌సైట్: https://rgnau.ac.in/
Similar News
News October 6, 2025
విశాఖలో మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయండి: లోకేశ్

ముంబై పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేశ్ వరుసగా పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతున్నారు. విశాఖలో మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయాలని రహేజా గ్రూప్‌ను కోరారు. అమరావతిలో ప్రీమియం అపార్ట్‌మెంట్ ప్రాజెక్టులను ప్రారంభించాలని కోరారు. అంతకుముందు టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో భేటీ అయిన లోకేశ్.. సెల్, మాడ్యూల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ స్థాపనకు గల అవకాశాలను పరిశీలించాలని కోరారు.
News October 6, 2025
ట్రయథ్లాన్ అంబాసిడర్‌గా సయామీఖేర్

బాలీవుడ్ నటి, అథ్లెట్ సయామీ ఖేర్ ‘ఐరన్‌మ్యాన్ 70.3’ ట్రయథ్లాన్‌కు అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ఏడాదిలోపు రెండుసార్లు ‘ఐరన్‌మ్యాన్ 70.3’ ట్రయథ్లాన్ పూర్తి చేసినందుకుగానూ ఐరన్‌మ్యాన్ ఇంటర్నేషనల్ కమిటీ ఆమెను ఎంపిక చేసింది. ఇందులో ఈత(1.9 KM), సైక్లింగ్(90 KM), పరుగు(21.1 KM) పోటీల్లో వరుసగా పాల్గొనాలి. గతేడాది సెప్టెంబరులో తొలిసారి, ఈ ఏడాది జులైలో రెండోసారి సయామీ సత్తాచాటి పతకం అందుకున్నారు.
News October 6, 2025
స్థానిక సంస్థల్లో BCలకు 34% కోటాపై CBN ఆదేశాలు

AP: BCలను ఉన్నతస్థాయికి తీసుకెళ్లేలా భారీగా నిధులు వెచ్చిస్తున్నా ఆశించిన ఫలితం రావడం లేదని CM CBN అన్నారు. అందరికీ సమానంగా సంక్షేమ ఫలాలు దక్కేలా చూడాలని అధికారులకు సంక్షేమ సమీక్షలో సూచించారు. కులవృత్తుల్లో ఆధునీకరణతోనే ఆయా వర్గాలు ఎక్కువ ఆదాయాన్ని పొందగలవని చెప్పారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి న్యాయపరమైన ఆటంకాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.