News September 26, 2025

15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలు: సీఎం

image

AP: తాము 15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలు కల్పించామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. మెగా డీఎస్సీ ద్వారా 15,941, వివిధ ప్రభుత్వ విభాగాల్లో 9,093, పోలీస్ శాఖలో 6,100 మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. స్కిల్ డెవెలప్‌మెంట్-జాబ్ మేళాల ద్వారా 92,149, వర్క్ ఫ్రం హోం ద్వారా 5,500, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, ఐటీ లాంటి ప్రైవేట్ రంగంలో 3.48లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్టు వివరించారు.

Similar News

News February 12, 2026

జాహ్నవి కుటుంబానికి రూ.262 కోట్లు

image

2023లో USలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని మరణించిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల(23)కి న్యాయం దక్కింది. ఆమె కుటుంబానికి $29 మిలియన్లు(రూ.262 కోట్లు) ఇచ్చేందుకు సియాటెల్ సిటీ విభాగం అంగీకరించింది. ‘జాహ్నవి మృతి బాధాకరం. ఆమె కుటుంబానికి ఆర్థిక సహకారం కొంత మేలు చేకూరుస్తుందని ఆశిస్తున్నాం’ అని న్యాయవాది ఎరికా వెల్లడించారు. ఆమె మరణానికి <<13652111>>విలువలేదంటూ<<>> పోలీస్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనమయ్యాయి.

News February 12, 2026

ACTRECలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

టాటా మెమోరియల్ సెంటర్ -అడ్వాన్స్‌డ్ సెంటర్ ఫర్ ట్రీట్‌మెంట్, రీసెర్చ్& ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్(ACTREC) 25 మెడికల్, నాన్ మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు మార్చి 4వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో DM/DNB, MD, MSc/మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్/MBBS/BDS/BAMS/BHMS/ఫార్మా డీ, BSc అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://actrec.gov.in

News February 12, 2026

శివ నామాలు అర్థాలు ‘‘చంద్రశేఖర’’

image

దక్షుడి శాపం వల్ల చంద్రుడి కళలు క్షీణించి, ఉనికినే కోల్పోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు చంద్రుడు శివుడిని శరణు వేడగా ఆయన కరుణించాడు. చంద్రుడిని తన తలపై నెలవంకగా ధరించాడు. అలా చంద్రుడికి పునర్జన్మనిచ్చి లోకానికి వెలుగు ప్రసాదించాడు. తనను ఆశ్రయించిన వారికి మృత్యు భయం ఉండదని చెప్పడానికి ఇదొక నిదర్శనం. చంద్రుడిని శిఖరంపై(తలపై) అలంకారంగా ధరించిన వాడు కాబట్టి ఆయనను ‘చంద్రశేఖరుడు’గా కీర్తిస్తున్నాం.