News July 22, 2024
47,999 సర్వీస్ కనెక్షన్లకు పవర్ కట్: సీఎండీ

వర్షాలు కారణంగా ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో 140 గ్రామాల్లో 47,999 సర్వీస్ కనెక్షన్లకు విద్యుత్తు అంతరాయం ఏర్పడినట్లు సీఎండీ పృథ్వితేజ్ తెలిపారు. విశాఖలో మాట్లాడుతూ.. నేలకొరిగిన విద్యుత్తు స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలు, పడిపోయిన ట్రాన్స్ఫార్మర్లను యుద్ధ ప్రాతిపదికన సరి చేశామన్నారు. కంట్రోల్ రూమ్‌కు వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయి సిబ్బందికి తెలియజేసి తక్కువ సమయంలో విద్యుత్‌ను పునరుద్ధరించామన్నారు.
Similar News
News February 23, 2026
విశాఖలో ట్రాఫిక్ టెన్షన్.. విద్యార్థులు విలవిల

విశాఖపట్నంలో భారీగా నిలిచిపోతున్న ట్రాఫిక్ ఇంటర్మీడియట్ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోలేమోనన్న టెన్షన్‌తో విద్యార్థులు సతమతమవుతున్నారు. రోడ్లపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో పరీక్షా సమయం మించిపోతుందని భయపడుతున్నారు. ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా విద్యార్థులు కాస్త ముందుగానే బయలుదేరాలని అధికారులు సూచిస్తున్నారు.
News February 23, 2026
విశాఖ: ప్రభుత్వ కార్యాలయల్లో పీజీఆర్ఎస్

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అయితే గతవారం పీజీఆర్ఎస్ నిర్వహించలేదు.
News February 23, 2026
నేడు విశాఖ పోలీస్ కమిషనరేట్‌లో PGRS

విశాఖపట్టణం సిటీ పోలీస్ కమిషనరేట్‌లో ప్రతి సోమవారం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రజలు తమ సమస్యలను నేరుగా కమిషనర్‌కు విన్నవించుకోవచ్చు. అందిన ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకుని పరిష్కారం చూపిస్తామని సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ప్రజల సమస్యలకు తక్షణ స్పందన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.


