News February 26, 2025
48 గంటలు సైలెన్స్ పీరియడ్ అమలు:కలెక్టర్

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున 48 గంటలపాటు సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రకటించారు. ఈ సైలెన్స్ పీరియడ్లో సభలు సమావేశాలు, రాజకీయపరమైన సంక్షిప్త సందేశాలు బల్క్ ఎస్ఎంఎస్ పంపడం పై నిషేధం విధించినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే సందేశాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ఉత్తర్వులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
Similar News
News December 9, 2025
NGKL: లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఏఈ

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల ఇన్చార్జి ఏఈ వెంకటేష్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు మంగళవారం పట్టుబడ్డాడు. చొక్కన్నపల్లి గ్రామానికి చెందిన రైతు వద్ద రూ.20 వేలు డిమాండ్ చేసి, రూ.15 వేలు తీసుకుంటుండగా అధికారులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. కల్వకుర్తి ప్రాంతంలో వరుస ఏసీబీ దాడులు జరుగుతున్నా అధికారుల తీరులో మార్పు రావడం లేదని స్పష్టమవుతోంది.
News December 9, 2025
కామారెడ్డి: మరికాసేపట్లో మొదటి విడత ఎన్నికల ప్రచారానికి తెర

కామారెడ్డి జిల్లాలోని మొదటి విడత ఎన్నికల ప్రచారం మరికాసేపట్లో ముగియనుంది. కామారెడ్డి, రామారెడ్డి, తాడ్వాయి, సదాశివనగర్, భిక్నూర్, బీబీపేట, దోమకొండ, రాజంపేట, మాచారెడ్డి, పల్వంచ మండలాల్లోని గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు, పలు పార్టీల మద్దతుదారులు, నవతరం యువత వినూత్న పద్ధతుల్లో, విస్తృతంగా ప్రచారం చేశారు. సాయంత్రం 6గం.లకు ప్రచారానికి ఇక తెర పడనుంది.
News December 9, 2025
అవినీతికి అడ్డుకట్ట వేయొచ్చిలా: కలెక్టర్

1064 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయడం ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని ఆవరణలో ఆయన అదనపు కలెక్టర్ డి.వేణుతో కలిసి అవినీతి నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకొని విజిలెన్స్ వారోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఉద్యోగులు బాధ్యతతో పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చేలా వ్యవహరించాలన్నారు.


