News February 25, 2025
48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్: ఇలా త్రిపాఠి

ఈనెల 27న జరగనున్న వరంగల్- ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో 48 గంటలు సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. సైలెన్స్ పీరియడ్‌లో భాగంగా ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి 27సాయంత్రం 4 గంటల వరకు సభలు, ఊరేగింపులు, ప్రచారాలు నిషేధమని చెప్పారు.
Similar News
News February 25, 2025
ఏనుగుల దాడి.. మృతులకు రూ.10 లక్షల పరిహారం

AP: అన్నమయ్య జిల్లాలో భక్తులపై <<15571904>>ఏనుగుల దాడి<<>> ఘటనలో మృతుల కుటుంబాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిహారం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అనౌన్స్ చేశారు. క్షతగాత్రుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఇస్తామని పేర్కొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
News February 25, 2025
వేములవాడ: రెండు బైక్‌లు ఢీ.. గాయాలు

వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ ముందు రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కోనరావుపేట మండలం మామిడిపల్లికి చెందిన సాయి, లక్షణ్, చందుర్తి మండలం సనుగులకు చెందిన భూపతి, గంగాధర్‌కు గాయాలయ్యాయి. దీంతో వారిని స్థానికులు వేములవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News February 25, 2025
పార్వతీపురం: 48 గంటల పాటు మద్యం దుకాణాలు బంద్

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లాలోని అన్ని మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాల్లో 48 గంటల పాటు అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు మూసివేయాలన్నారు. వచ్చే నెల మూడో తేదీన ఓట్ల లెక్కింపు రోజున కూడా వీటిని మూసివేయాలని ఆదేశించారు.