News February 26, 2025
48 గంటలు సైలెన్స్ పీరియడ్ అమలు:కలెక్టర్

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున 48 గంటలపాటు సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రకటించారు. ఈ సైలెన్స్ పీరియడ్‌లో సభలు సమావేశాలు, రాజకీయపరమైన సంక్షిప్త సందేశాలు బల్క్ ఎస్ఎంఎస్ పంపడం పై నిషేధం విధించినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే సందేశాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ఉత్తర్వులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
Similar News
News February 26, 2025
తాళ్లపూడి: గల్లంతై చనిపోయింది వీరే..!

తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామం పండగ రోజు తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నదీ స్నానానికి దిగిన 11 మందిలో ఐదుగురు గల్లంతై చనిపోయారు. మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. 20 సంవత్సరాలు దాటకుండానే ఆ యువకులు చనిపోయారు. మృతదేహాల వద్ద వారి కుటుంబసభ్యులు రోదించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. ఆల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారులు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
News February 26, 2025
కాంగోలో వింతవ్యాధి: సోకిన 48 గంటల్లోపే మరణం

కాంగో దేశాన్ని ఓ వింత వ్యాధి 5 వారాలుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. జ్వరం, వాంతులు, అంతర్గత రక్తస్రావంతో ప్రజలు చచ్చిపోతున్నారు. ఈ లక్షణాలు ఎబోలా, డెంగ్యూ, మార్బర్గ్, యెల్లో ఫీవర్‌ను పోలివుండటంతో WHO సైతం ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని రోజుల క్రితం బొలొకొ గ్రామంలో గబ్బిలాలను తిన్న ముగ్గురు పిల్లలు 48 గంటల్లోపే చనిపోవడంతో ఔట్‌బ్రేక్ మొదలైంది. 419 మందికి సోకింది. 53 మందిని చంపేసింది.
News February 26, 2025
క్రికెటే నా ప్రాణం: రోహిత్ శర్మ

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ అంటే తనకు ప్రాణమని తాను బతికేదే ఆటకోసమని అన్నారు. ఛాంపియన్స్ ట్రోఫిలో ఇండియా సెమీస్ చేరటంపై రోహిత్ సంతోషం వ్యక్తం చేశారు. కోహ్లీ అంటే తనకెంతో ఇష్టమని.. ఇండియా విజయం కోసం అతను దేనికైనా సిద్ధంగా ఉంటాడని తెలిపారు. ప్రస్తుతం కప్పు గెలవటం పైనే తన పూర్తి ఫోకస్ ఉందని హిట్‌మ్యాన్ వివరించారు.