News February 25, 2025
48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్: ఇలా త్రిపాఠి

ఈనెల 27న జరగనున్న వరంగల్- ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో 48 గంటలు సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. సైలెన్స్ పీరియడ్‌లో భాగంగా ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి 27సాయంత్రం 4 గంటల వరకు సభలు, ఊరేగింపులు, ప్రచారాలు నిషేధమని చెప్పారు.
Similar News
News February 25, 2025
నాగర్ కర్నూల్ చెరువులో మహిళ మృతదేహం

నాగర్ కర్నూల్ పట్టణ సమీపంలోని కేసరి సముద్రం చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటన సోమవారం సాయంత్రం వెలుగు చూసింది. చెరువులోని బతుకమ్మ ఘాట్ దగ్గర గుర్తుతెలియని మహిళా మృతదేహం కనిపించినట్లు స్థానికులు తెలిపారు. చెరువులోని మహిళా మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News February 25, 2025
నేడు ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ రెండు బలమైన జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. దీంతో మరో బిగ్ స్కోరింగ్ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించే అవకాశం ఉంది. కాగా గ్రూప్-బిలోని ఈ రెండు జట్లు ఇప్పటివరకు చెరో మ్యాచ్ గెలిచాయి. నేటి గేమ్‌లో గెలిచే టీమ్ సెమీస్ స్థానాన్ని పదిలం చేసుకోనుంది.
News February 25, 2025
వడ్డేపల్లి: పెళ్లింట విషాదం.. వరుడి సోదరుడు మృతి

వడ్డేపల్లి మండలం శాంతినగర్ సమీపంలో సోమవారం బైక్, బొలెరో ఢీకొన్న ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మురళి మృతి చెందాడు. స్థానికుల వివరాలిలా.. మండలంలోని బుడ్డమొరుసుకి చెందిన రాజన్నకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు జానకి రాముడు వివాహం ఆదివారం జరిగింది. వివాహానికి వచ్చిన బంధువులను శాంతినగర్ లో దింపేందుకు చిన్న కుమారుడు మురళి వెళుతుండగా ప్రమాదం జరిగి పెళ్లింట విషాదం నెలకొంది. బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.