News September 18, 2024

నెలలోనే 48 మంది శిశువులు మృతి.. KTR ఫైర్

image

గాంధీ ఆస్పత్రిలో ఆగస్టు నెలలో 48 మంది పసిపిల్లలు, 14 మంది బాలింతలు చనిపోవడంపై కేటీఆర్ ఫైరయ్యారు. ‘ఇది ఊహించుకుంటేనే ఒళ్లు జ‌ల‌ద‌రిస్తోంది. రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఉందా? వ్య‌వ‌స్థ‌లు ప‌నిచేస్తున్నాయా? ఎంతో మందికి ప్రాణం పోసిన గాంధీలో ఇంత విషాదం ఎవ‌రి పాపం? ఒక్క ఆస్పత్రిలోనే ఇలా ఉంటే రాష్ట్రం మొత్తం ఇంకెలా ఉందో. పాల‌న గాలికి వ‌దిలి విగ్ర‌హ రాజ‌కీయాలు చేస్తే ఇలానే ఉంటుంది’ అని మండిపడ్డారు.

Similar News

News October 16, 2025

నైరుతి రుతుపవనాలు నిష్క్రమించాయి: APSDMA

image

AP: దేశం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించాయని APSDMA తెలిపింది. దేశంలోకి మే 24న, రాష్ట్రంలోకి మే 26న ఈ రుతుపవనాలు ప్రవేశించినట్లు వివరించింది. అటు ఇవాళ దక్షిణ భారతంలోకి ఈశాన్య రుతుపవనాలు ఎంటర్ అవుతాయని ఐఎండీ పేర్కొంది. దీంతో ఇవాళ ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది.

News October 16, 2025

డెక్కన్ సిమెంటు వివాదంతో నాకు సంబంధం లేదు: ఉత్తమ్

image

TG: డెక్కన్ సిమెంటు కంపెనీ వ్యవహారంతో తనకు సంబంధం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆ వివాదంపై తాను మాట్లాడేది లేదన్నారు. ‘నా ప్రమేయం లేదని కొండా సురేఖ కుమార్తె కూడా చెప్పారు కదా?’ అని ముక్తసరిగా స్పందించారు. కొన్నిరోజులుగా మంత్రి కొండా సురేఖకు ఇతర మంత్రులకు మధ్య వివాదం రేగడం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం కూడా దృష్టి సారించింది. పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి రంగంలోకి దిగారు.

News October 16, 2025

పాత రిజర్వేషన్లతో ‘స్థానిక’ ఎన్నికలు!

image

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం మళ్లీ మొదటికొచ్చింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-9ను అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది. దీంతో స్థానిక ఎన్నికలు పాత రిజర్వేషన్ల ఆధారంగానే జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ గతంలో ఇచ్చిన హామీ ప్రకారం పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఉంది. త్వరలో దీనిపై క్లారిటీ రానుంది.