News February 25, 2025

వారానికి 48గంటల పని చాలు: అశ్విన్ యార్ది

image

‘క్యాప్‌జెమినీ’ ఇండియా సీఈఓ అశ్విన్ యార్ది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగి రోజుకు 9.30గంటల చొప్పున వారానికి ఐదు రోజులు పనిచేస్తే సరిపోతుందని తెలిపారు. అంతేకాకుండా వారాంతాల్లో ఉద్యోగులను ఇబ్బంది పెట్టకూడదని వారికి మెయిల్స్ పంపడానికి తాను వ్యతిరేకమని అన్నారు. అయితే గతంలో ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ వారంలో 90 గంటలు పనిచేయాలన్న వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

Similar News

News February 25, 2025

ఎల్లుండి స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని డిమాండ్

image

TG: ఈ నెల 27 ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. 27న స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయడంతో విద్యాసంస్థలు సిబ్బందికి సెలవు ఇవ్వడం లేదన్నారు. కొన్ని గంటలు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఉద్యోగులకు ఏడాదిలో అందించే సెలవులతో సంబంధం లేకుండా పోలింగ్ రోజు సెలవు ఇవ్వాలని బండి విజ్ఞప్తి చేశారు.

News February 25, 2025

రోహిత్‌ను డిన్నర్ పార్టీ అడుగుతా: అక్షర్

image

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రోహిత్ క్యాచ్ డ్రాప్ చేసి అక్షర్ హ్యాట్రిక్ మిస్ చేశారు. దీంతో డిన్నర్‌కు <<15528906>>తీసుకెళ్తానంటూ<<>> హిట్ మ్యాన్ ఇచ్చిన ఆఫర్‌పై ఆల్‌రౌండర్ స్పందించారు. ‘టీమ్ ఇప్పటికే సెమీస్‌కు క్వాలిఫై అయ్యింది. పైగా కివీస్‌తో తర్వాతి మ్యాచ్‌కు ఆరు రోజుల సమయం ఉంది. రోహిత్‌ను డిన్నర్ పార్టీ అడగడానికి ఛాన్స్ వచ్చింది’ అని పేర్కొన్నారు.

News February 25, 2025

ఆ స్కూళ్లలో తెలుగు తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు

image

TG: సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ బోధించే స్కూళ్లలో తప్పనిసరి సబ్జెక్టుగా తెలుగు ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. సింగిడి(స్టాండర్డ్ తెలుగు) స్థానంలో సులభతర తెలుగు వాచకం ‘వెన్నెల’ను 9, 10వ తరగతుల్లో బోధించాలని స్పష్టం చేసింది. 1-10 క్లాసుల వరకు తెలుగు బోధన, పరీక్షలు నిర్వహించాలని ఆయా బోర్డులను ఆదేశించింది. గత ప్రభుత్వం తెలుగును పూర్తిస్థాయిలో అమలు చేయలేదని పేర్కొంది.

error: Content is protected !!