News March 29, 2025
రాష్ట్రంలో 4,818 చలివేంద్రాలు

TG: ఎండలు ముదిరిన నేపథ్యంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రవ్యాప్తంగా 4,818 చలివేంద్రాలను ఏర్పాటు చేసింది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 458, అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరిలో 8 చలివేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటి నిర్వహణ బాధ్యతలను పంచాయతీ సిబ్బందికి అప్పగించారు. వాటర్ బాటిల్స్ కొనుక్కోకుండా, చలివేంద్రాల్లో ఉచితంగా నీటిని తాగాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News January 7, 2026
అసెంబ్లీ నిరవధిక వాయిదా

తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ఈ సెషన్లో సభ 13 బిల్లులు, 2 తీర్మానాలను ఆమోదించింది. 5 రోజుల్లో 40 గంటల 45 నిమిషాల పాటు అసెంబ్లీ జరిగింది. ఈ సమావేశాల్లో కృష్ణా జలాలపై చర్చ జరగ్గా ప్రధాన ప్రతిపక్షం BRS దూరంగా ఉంది. మాజీ సీఎం కేసీఆర్ తొలిరోజు సంతకం చేసి వెళ్లిపోయారు. తిరిగి సభకు హాజరుకాలేదు.
News January 7, 2026
అలారం పెట్టుకునే అలవాటు ఉందా?

అలారం శబ్దంతో నిద్ర లేవడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మెదడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు హఠాత్తుగా అలారం సౌండ్ రావడం వల్ల బీపీ పెరిగే ఛాన్స్ ఉందని, గుండె సంబంధ వ్యాధులూ వస్తాయని వార్నింగ్ ఇస్తున్నారు. మాటిమాటికి స్నూజ్ నొక్కడం వల్ల స్లీప్ సైకిల్ దెబ్బతిని రోజంతా అలసటగా అనిపిస్తుందని తెలిపారు. సహజంగా ఒకే సమయానికి నిద్రలేవడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.
News January 6, 2026
శ్రీవాణి దర్శన టికెట్లు ఇక ఆన్‌లైన్‌లోనే

తిరుమలలో శ్రీవాణి దర్శన టికెట్లను ఆఫ్‌లైన్‌లో జారీ చేయడాన్ని TTD నిలిపేసింది. ఈ నెల 9 నుంచి రోజూ ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో 800 టికెట్లను కేటాయించనుంది. ఉ.9 గంటలకు విడుదల చేయనుంది. టికెట్ పొందిన భక్తులు అదే రోజు సా.4 గంటలకు దర్శనానికి రిపోర్ట్ చేయాలి. ఈ విధానాన్ని నెల రోజులు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఒక కుటుంబానికి నలుగురు(1+3) సభ్యులకే టికెట్ బుకింగ్‌కు అనుమతి ఉంటుంది.


