News September 15, 2024
488 జాబ్స్.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

AP: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, బోధనాస్పత్రుల్లో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు రేపటితో (SEP 16) ముగియనుంది. రెగ్యులర్ ప్రాతిపదికన లేటరల్ ఎంట్రీ విధానంలో భర్తీ కానున్న ఈ పోస్టులకు మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (MD/MS/DNB/DM) చేసిన వారు అర్హులు. వయసు ఓసీలకు 42 ఏళ్లు , మిగతా వారికి 47 ఏళ్లు మించకూడదు. పూర్తి వివరాల కోసం <
Similar News
News October 27, 2025
ఐసీయూలో శ్రేయస్ అయ్యర్

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ సిడ్నీలోని ఓ ఆస్పత్రిలో రెండ్రోజుల నుంచి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆస్ట్రేలియాతో మూడో వన్డే ఆడుతున్న సమయంలో క్యాచ్ పట్టే క్రమంలో అయ్యర్ తీవ్రంగా <<18098991>>గాయపడిన<<>> విషయం తెలిసిందే. వెంటనే మైదానాన్ని వీడగా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో రిబ్స్లో రక్తస్రావం అయినట్లు గుర్తించారు. వారం రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని క్రీడా వర్గాలు తెలిపాయి.
News October 27, 2025
ప్రెగ్నెన్సీ తర్వాత జుట్టు తీరు మారిందా?

ప్రెగ్నెన్సీలో మహిళల శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. అయితే ప్రెగ్నెన్సీలో ఒత్తుగా, పొడవుగా పెరిగిన జుట్టు డెలివరీ తర్వాత రాలిపోతుంది. కొందరిలో జుట్టు టెక్స్చర్ కూడా మారుతుందంటున్నారు నిపుణులు. ప్రెగ్నెన్సీ, డెలివరీ తర్వాత ఈస్ట్రోజన్ హెచ్చుతగ్గులకు లోనవుతుంది. ఆ ప్రభావం మాడుపై పడి కొన్నిసార్లు స్ట్రెయిట్హెయిర్ రింగులుగా, కర్లీహెయిర్ స్ట్రెయిట్గా మారొచ్చని, ఇది సాధారణమేనని చెబుతున్నారు.
News October 27, 2025
పంచభూతాల నుంచి నేర్చుకుందాం!

జీవితంలో విజయం సాధించడానికి పంచభూతాల నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. భూమిలా సహనంతో ధైర్యంగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. నీరు మురికిని కడిగినట్టు మంచి మనసుతో నెగటివిటీని దూరం చేయాలి. ఎక్కడా అటాచ్ అవ్వకుండా గాలిలా స్వేచ్ఛగా జీవించాలి. నిప్పులా మీ ఆత్మవిశ్వాసం, శక్తి ప్రకాశవంతంగా వెలగాలి. ఆకాశం దేనికీ కనెక్ట్ అవ్వనట్టు, మనపై పని ఒత్తిడి పడకుండా రిలాక్స్డ్గా ఉండాలి. SHARE IT


