News October 28, 2025
MCEMEలో 49 ఉద్యోగాలు

మిలటరీ కాలేజీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్(MCEME)49 గ్రూప్ సీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అర్హతగల అభ్యర్థులు నవంబర్ 14వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/PET&PST, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
Similar News
News October 28, 2025
ఇతిహాసాలు క్విజ్ – 49 సమాధానాలు

1. శ్రీరామదాసుగా ప్రసిద్ధి చెందిన భక్తుడు ‘కంచర్ల గోపన్న’.
2. భూలోకానికి పైన ఉండే మొదటి లోకం ‘భువర్లోకం’.
3. రామసేతు నిర్మాణంలో ప్రధాన ఇంజినీర్లు ‘నల-నీల’ అనే ఇద్దరు వానరులు.
4. యుద్ధాన్ని చూస్తూ దాన్ని ధృతరాష్ట్రునికి వివరించింది ‘సంజయుడు’.
5. శివుడు తన జటాజూటంలో బంధించిన నది ‘గంగ’.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 28, 2025
గోళ్లు అందంగా ఉండాలంటే ఇలా చేయండి

చేతులు అందంగా ఉండటంలో గోళ్లు ప్రముఖపాత్ర పోషిస్తాయి. వీటిని సంరక్షించుకోవడానికి మీ కోసం కొన్ని చిట్కాలు. రెగ్యులర్‌గా గోళ్లను కట్ చేసుకోవాలి. గోళ్లు ఎక్కువగా నీటిలో నానకుండా పొడిగా, శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. మీ నెయిల్స్, క్యూటికల్స్‌ను మాయిశ్చరైజ్ చెయ్యాలి. నెయిల్ పెయింట్ ఎక్కువ కాలం ఉంచకుండా చూసుకోవాలి. ఫంక్షన్ల వంటివి పూర్తయిన తర్వాత.. పాలిష్ రిమూవ్ చేసుకోవడం వల్ల గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
News October 28, 2025
NOV 1 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్

ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోతున్న పొల్యూషన్ కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. NOV 1 నుంచి నగరంలో BS-4, BS-5 డీజిల్ వాహనాలను బ్యాన్ చేయాలని నిర్ణయించింది. BS-6 డీజిల్ వాహనాలను మాత్రమే అనుమతించనుంది. దీన్ని సక్రమంగా అమలు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ రూల్‌ను అతిక్రమిస్తే భారీగా జరిమానాలు వేయాలంది. అన్ని మేజర్ ఎంట్రీ పాయింట్ల వద్ద వాహనాలను తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.


