News January 1, 2026
496 వాహనదారులకు జరిమానాలు: ఎస్పీ నరసింహ

నూతన సంవత్సర వేడుకల వేళ పోలీసులు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొరడా ఝుళిపించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 140 మందిపై కేసులు నమోదు చేయగా, ట్రాఫిక్ నియమాలు పాటించని 496 వాహనదారులకు జరిమానా విధించినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు.
Similar News
News January 3, 2026
TU: ఈ నెల 16 నుంచి B.Ed, B.P.Ed 1,3 వ సెమిస్టర్ పరీక్షలు

టీయూ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో B.Ed, B.P.Ed 1, 3వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఈనెల 16 నుంచి నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. B.Ed 1వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 16 నుంచి 29 వరకు జరగనుండగా 3 వ సెమిస్టర్ 16 నుంచి 24 వరకు జరగనున్నాయి. అటు B.P.Ed 1, 3వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 16 నుంచి 22 వరకు జరగనున్నాయి. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ చూడాలన్నారు.
News January 3, 2026
వివక్ష ఎదుర్కొన్నా.. మాటల దాడి చేశారు: ఖవాజా

అంతర్జాతీయ క్రికెట్‌కు <<18737315>>రిటైర్మెంట్<<>> ప్రకటించిన ఆస్ట్రేలియా ప్లేయర్ ఉస్మాన్ ఖవాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆస్ట్రేలియాలో వివక్ష ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. నేనూ ఎదుర్కొన్నా. ఇస్లామోఫోబియా ప్రబలంగానే ఉంది’ అని చెప్పారు. వెన్నునొప్పి వల్ల ఇటీవల పెర్త్ టెస్టుకు దూరమైతే మాజీ ఆటగాళ్లు, మీడియా తనపై మాటల దాడి చేసినట్లు వాపోయారు. తన క్రెడిబిలిటీనే ప్రశ్నించారని ఆవేదన వ్యక్తం చేశారు.
News January 3, 2026
నార్నూర్ అభివృద్ధికి నిధులు సద్వినియోగం చేయాలి: కలెక్టర్

నీతి ఆయోగ్ డేటా ర్యాంకింగ్స్‌లో దేశవ్యాప్తంగా 4వ స్థానం, దక్షిణ భారతదేశంలో 1వ స్థానం సాధించిన నార్నూర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1.5 కోట్ల రివార్డ్ గ్రాంట్‌ను సమర్థవంతంగా వినియోగించాలని కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. నిధుల వినియోగంపై శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. నార్నూర్ సాధించిన ఈ విజయం జిల్లాకే గర్వకారణమని పేర్కొన్నారు.


