News April 7, 2025

4D PLAYER: 5 ఏళ్లలో ఆడింది 8 మ్యాచులే..!

image

న్యూజిలాండ్ విధ్వంసకర ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్‌కు IPL అస్సలు కలిసి రావడం లేదు. ఐదేళ్లుగా ఆయన IPLలో కొనసాగుతున్నా ఇప్పటివరకు 8 మ్యాచులే ఆడారు. RR-3, SRH-5, ప్రస్తుతం GT తరఫున ఒక్క మ్యాచూ ఆడలేదు. ఫిలిప్స్ బ్యాటింగ్, బౌలింగ్, వికెట్ కీపింగ్, ఫీల్డింగ్ అన్నిట్లోనూ అదరగొడుతున్నారు. ఆయన పట్టే క్యాచులకూ సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఫిలిప్స్‌కు ఏ ఫ్రాంచైజీ సరైన అవకాశాలు ఇవ్వడం లేదు. దీనిపై మీ కామెంట్?

Similar News

News November 25, 2025

నగదు విరాళాలపై కేంద్రం, ఈసీలకు సుప్రీం నోటీసులు

image

రాజకీయ పార్టీలకు గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే రూ.2 వేల లోపు నగదు విరాళాలకు ఐటీ మినహాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. నగదు రూపంలో విరాళాలు తీసుకుంటే ఎన్నికల గుర్తు కేటాయించబోమని, పొలిటికల్ పార్టీగా నమోదు చేయబోమని షరతులు విధించేలా ఈసీకి ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై అభిప్రాయం చెప్పాలని కేంద్రం, ఈసీతోపాటు రాజకీయ పార్టీలకు సుప్రీం నోటీసులిచ్చింది.

News November 25, 2025

GAIL (INDIA) లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>GAIL<<>>(INDIA)లిమిటెడ్‌ 29 బ్యాక్‌లాగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 23 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి LLB, BE, B.Tech, ME, M.Tech, MCA, MBA, CA, CMA, B.Com, BA, BSc, MBBS, DGO, DCH ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.200, SC, ST, PWBDలకు ఫీజు లేదు. https://www.gailonline.com

News November 25, 2025

నేడు మరో అల్పపీడనం.. 5 రోజులు వర్షాలు!

image

AP: మలక్కా జలసంధి పరిసరాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడనుందని APSDMA తెలిపింది. మరో 48hrsలో తుఫానుగా మారనుందని పేర్కొంది. అటు ఇవాళ నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. వీటి ప్రభావంతో ఇవాళ్టి నుంచి 28 వరకు ద.కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 29, 30 తేదీల్లో ద.కోస్తా. రాయలసీమల్లో భారీ నుంచి అతి భారీ, ఉ.కోస్తాలో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది.