News January 30, 2025
5న ప్రకాశం జిల్లాకు పవన్.. భారీ బహిరంగ సభ?

పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 5న ప్రకాశం జిల్లాకు రానున్నట్లు సమాచారం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపు మేరకు పవన్ కళ్యాణ్ ఒంగోలుకు వచ్చేందుకు సుముఖత చూపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి, తన బలాన్ని చాటుకోవాలని బాలినేని భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అలాగే జనసేనలోకి పవన్ సమక్షంలో భారీగా చేరికలు ఉండనున్నట్లు టాక్. పవన్ పర్యటనపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది.
Similar News
News February 18, 2025
టెట్ విషయంలో లోకేశ్‌పై ప్రకాశం MLA సెటైర్లు

మంత్రి లోకేశ్‌పై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి X వేదికగా కామెంట్ చేశారు.”బాబు లోకేశ్ గారు మెగా డీఎస్సీ ద్వారా అధికారంలోకి వచ్చిన 6నెలల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి, జగనన్న హయాంలో ఇచ్చిన DSC నోటిఫికేషన్ రద్దు చేశారన్నారు. 9 నెలల తర్వాత అడుగుతున్నా. మీ హెరిటేజ్ సంస్థ షేర్ పెరిగిందని, సంతకం పెట్టిన 16,347 టీచర్ పోస్టుల భర్తీ ఎందుకు చేయలేదు దొర.? అని ట్వీట్ చేశారు.
News February 18, 2025
ప్రకాశం: SP పరిష్కార వేదికకు 81 ఫిర్యాదులు

ప్రజా ఫిర్యాదులను పరిష్కరించుటకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ, పోలీస్ అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా నలువైపుల నుంచి విచ్చేసిన ప్రజలు వారి ఫిర్యాదుల గురించి ఎస్పీకి విన్నవించుకున్నారు. ఈ వేదికకు 81 ఫిర్యాదుల అందినట్లు ఎస్పీ తెలిపారు. ఫిర్యాదుల గురించి సవివరంగా అడిగి తెలుసుకుని, వాటిని చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు.
News February 17, 2025
ఒంగోలులో విద్యుత్ అదాలత్ కార్యక్రమం

ఒంగోలులో ఈ నెల 18 తేదిన డివిజన్ స్థాయి విద్యుత్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఒంగోలు ఈఈ ఏం.హరిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల ఫోరమ్ ఛైర్మన్ ఎన్.విక్టర్ ఇమ్మానుయేల్ పాల్గొంటారని అన్నారు. ఉదయం 10:30 గం నుంచి మధ్యాహ్నం 1:30 వరకు కార్యక్రమం ఉంటుందని అన్నారు. దీర్ఘ కాలంగా పరిష్కారం కాని విద్యుత్ సమస్యలకు పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు.