News November 4, 2024

5న ప్రకాశం జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశం

image

ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద రెడ్డి చెప్పారు. సమావేశానికి పార్టీ జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, ఒంగోలు పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొంటారన్నారు. జిల్లాలోని నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు, అన్ని కమిటీలతో సమావేశం నిర్వహిస్తారని పేర్కొన్నారు.

Similar News

News October 22, 2025

ఇసుక అక్రమ రవాణాపై కలెక్టర్‌కు ఫిర్యాదు

image

జరుగుమల్లి నుంచి కొందరు అక్రమంగా ఇసుకను ఒంగోలుకు తరలిస్తున్నారని ఫలితంగా ఒంగోలులో ఇసుక యార్డుల నుంచి సరఫరా చేసే తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కలెక్టర్ రాజా బాబుకు రవాణాదారులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఆయా వనరుల నుంచి 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఇసుకను తరలిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని
కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలన్నారు.

News October 22, 2025

విద్యుత్ షాక్ తో తండ్రి, కొడుకు మృతి..

image

పొదిలి మండలం సలకనూతల గ్రామం సమీపంలో మంగళవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. పొలం పనులు ముగించుకొని భారీ వర్షంలో ట్రాక్టర్ పై గ్రామానికి వెళ్తున్న తండ్రి, కొడుకు విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మాదాల పెదకోటయ్య (60), మాదాల వెంకటేశ్వర్లు (25)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

News October 21, 2025

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపాలి: కలెక్టర్

image

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన అధ్యక్షతన ఒంగోలు క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇసుక లభ్యత,‌ రవాణా, వర్షాకాలం దృష్ట్యా ముందుగానే ప్రజలకు అవసరమైన స్థాయిలో యార్డుల్లో అందుబాటులో ఉంచడం తదితర అంశాలను గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ కలెక్టర్‌కు వివరించారు.