News April 2, 2025

5 ఉద్యోగాలు సాధించిన గూడెం రైతుబిడ్డ

image

5 ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రుల కష్టాలు దూరం చేసి యువతకు ఆదర్శంగా నిలిచారు రైతు బిడ్డ చుంచు ఆనంద్. దండేపల్లి మండలం గూడెం గ్రామానికి గోపాల్- సత్తెవ్వ దంపతులు వ్యవసాయమే జీవనాధారంగా పనిచేస్తుంటారు. వారి కుమారుడు ఆనందర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో POగా ఎంపికయ్యారు. అలాగే కెనరా బ్యాంక్ క్లర్క్, UNION BANK LBO, IBPS PO, IDBI ఎగ్జిక్యూటివ్ పరీక్షల్లోనూ సత్తాచాటారు. దీనిపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News December 1, 2025

ములుగు: వాళ్లెందుకో వెనుకబడ్డారు..!

image

జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కడో వెనకబడిందా..!? అనే సందేహాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కూడా ఆపార్టీ నేతలు ప్రభావవంతంగా పని చేయడం లేదనే విమర్శలున్నాయి. జిల్లా అధ్యక్షుడు/ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మధ్య విబేధాలే కారణంగా తెలుస్తోంది. ఓ నేతకు ఆర్థిక సమస్య ఇబ్బందిగా మారిందని కేడర్ గుసగుసలాడుతోంది.

News December 1, 2025

మాయదారి మహమ్మారికి ఆరేళ్లు..!

image

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ‘కరోనా’ మహమ్మారిని నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. చైనా వుహాన్‌లో తొలి కరోనా కేసు నమోదై నేటికి ఆరేళ్లు. 2019లో మొదలైన ఈ మహమ్మారి అతి తక్కువ కాలంలోనే ప్రపంచాన్ని చుట్టుముట్టింది. 70లక్షల మంది ప్రాణాలను హరించి, కోట్లాది మందిని రోడ్డున పడేసింది. భారీ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న మానవాళి.. టీకాలు, ఆరోగ్య నియమాలతో పోరాడి గెలిచింది. కరోనా మీ జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చింది?

News December 1, 2025

SC కమిషన్‌ సెక్రటరీ కుమార్తె అనుమానాస్పద మృతి

image

రాష్ట్ర SC కమిషన్‌ సెక్రటరీ చిన్న రాముడు కుమార్తె మాధురి అనుమానాస్పదంగా మృతి చెందారు. బేతంచెర్ల మం. బుగ్గానిపల్లె తండాకు చెందిన ఆమె రాజేశ్ నాయుడును ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమెను 3 నెలల క్రితం తల్లిదండ్రులు తీసుకెళ్లారని రాజేశ్ తెలిపారు. మరో పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తున్నట్లు తనకు మెసేజ్ చేసిందని, గర్భిణి అని చూడకుండా చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని రాజేశ్ ఆరోపించడం సంచలనంగా మారింది.