News April 16, 2025
5 నిమిషాల్లో మేడ్చల్ జిల్లా చుట్టేయండి!

మీ జిల్లాలో జరిగిన అన్ని విషయాలు తెలుసుకునేందుకు Way2News యాప్లో ఇలా చేయండి. యాప్ ఓపెన్ చూస్తే రైట్ సైడ్ టాప్ మీ లొకేషన్ పేరుపై క్లిక్ చేయండి. పక్కన V సింబల్పై క్లిక్ చేస్తే 4 ఆప్షన్స్ మీ గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా చూపిస్తుంది. వాటిలో జిల్లాపై క్లిక్ చేస్తే 5MINలో మీ జిల్లా మొత్తం ఓ రౌండ్ వేయొచ్చు.
Similar News
News November 27, 2025
పెళ్లికి రెడీ.. అమ్మాయి కావాలి అంతే: చాహల్

భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్లాక్ డ్రెస్లో స్టైలిష్ ఫొటోలను షేర్ చేసిన ఈ స్పిన్నర్.. ‘నేను పెళ్లికి రెడీగా ఉన్నా. అమ్మాయి కావాలి అంతే’ అని క్యాప్షన్ పెట్టారు. భార్యతో విడాకులు అయితే చాలా మంది డిప్రెషన్లోకి వెళ్తారని, కానీ చాహల్ కాన్ఫిడెన్స్కు మెచ్చుకోవాల్సిందే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
News November 27, 2025
ములుగు: ఎన్నికల సమాచారం కోసం కంట్రోల్ రూమ్

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఫిర్యాదులు, సమాచారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. జిల్లాలో మొదటి విడతలో 48 సర్పంచ్, 420 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. నిర్వహణ కోసం ఫ్లయింగ్, స్టాటిస్టిక్, వీడియో సర్వేలెన్స్ బృందాలు, ఎంసీఎంసీ, ఎంసీసీ, ఇతర ఎన్నికల సంబంధిత పర్యవేక్షణ అధికారులను నియమించామని చెప్పారు.
News November 27, 2025
బాధ్యతతో విధులు నిర్వర్తించాలి: ములుగు SP

మేడారం జాతర ఏర్పాట్లలో అలసత్వం వహించొద్దని ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అన్నారు. ములుగులో మేడారం జాతరపై సమీక్ష నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. రానున్న మేడారం మహా జాతరకు వచ్చే భక్తుల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. జాతరలో ఎలాంటి అలసత్వం వహించొద్దని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులపై విస్తృతంగా చర్చించి, ప్రతి అధికారి వారికి అప్పగించిన పనిని నిబద్ధత, బాధ్యతతో నిర్వర్తించాలన్నారు.


