News April 16, 2025
5 నిమిషాల్లో RR జిల్లా చుట్టేయండిలా!

మీ జిల్లాలో జరిగిన అన్ని విషయాలు తెలుసుకునేందుకు Way2News యాప్‌లో ఇలా చేయండి. యాప్ ఓపెన్ చూస్తే రైట్ సైడ్ టాప్ మీ లొకేషన్ పేరుపై క్లిక్ చేయండి. పక్కన V సింబల్‌పై క్లిక్ చేస్తే 4 ఆప్షన్స్ మీ గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా చూపిస్తుంది. వాటిలో జిల్లాపై క్లిక్ చేస్తే 5MINలో మీ జిల్లా మొత్తం ఓ రౌండ్ వేయొచ్చు.
Similar News
News April 25, 2025
HYD: విద్యార్థులూ.. ఈ నంబర్లకు కాల్ చేయండి!

ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. త్వరలో 10వ తరగతి ఫలితాలు కూడా విడుదల కానున్నాయి. ఎగ్జామ్‌లో పాసైన వారి సంగతి అటుంచితే ఫెయిల్ అయిన వారు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. అందుకే వారికి భరోసా ఇచ్చేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. మానసిక వేదనకు గురవుతున్న వారు ఈ నంబర్లకు 7893078930, 04066202000, 9493238208, 9152987821, 14416 కాల్ చేయండి. వీరి సూచనలు ఒత్తిడిని తగ్గిస్తాయని అధికారులు చెబుతున్నారు.
News April 25, 2025
HYD: పచ్చటి కాపురంలో కలహాల చిచ్చు..!

పెళ్లైన కొన్నేళ్లకే ఆలుమగల మధ్య విభేదాలు పచ్చటి కాపురంలో చిచ్చు పెడుతున్నాయి. చిన్నవాటిని పెద్దగా చూస్తూ కాపురంలో సర్దుకోలేక HYD ఉమెన్ పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నారు. వారికి పోలీసులు కౌన్సెలింగ్ అందిస్తున్నారు. వారి మధ్య అన్యోన్యత దెబ్బతింటుందని, పెళ్లయ్యాక లావు అయ్యావని, అంతకు ముందు నువ్వు ఇలా లేవని ఒకరినొకరు దూషించుకుంటున్నట్లు ఉప్పల్ WPS పోలీసులు తెలిపారు.
News April 24, 2025
బల్కంపేట ఎల్లమ్మ గుడిలోని సంపులో పడి వ్యక్తి మృతి

బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి వచ్చిన ఓ వ్యక్తి సంపులో పడి మృతిచెందాడు. కాచిగూడకు చెందిన బి.బాలాజీ (48) కుటుంబ సభ్యులతో కలిసి ఎల్లమ్మ ఆలయానికి వచ్చాడు. అక్కడ నీటి సంపులో ఫోన్ పడిపోయింది. ఫోన్ తీసేందుకు యత్నించి సంపులో పడిపోయాడు. సిబ్బంది నిచ్చెన సాయంతో బాలాజీని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.