News April 2, 2025
5 ఉద్యోగాలు సాధించిన గూడెం రైతుబిడ్డ

5 ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రుల కష్టాలు దూరం చేసి యువతకు ఆదర్శంగా నిలిచారు రైతు బిడ్డ చుంచు ఆనంద్. దండేపల్లి మండలం గూడెం గ్రామానికి గోపాల్- సత్తెవ్వ దంపతులు వ్యవసాయమే జీవనాధారంగా పనిచేస్తుంటారు. వారి కుమారుడు ఆనందర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో POగా ఎంపికయ్యారు. అలాగే కెనరా బ్యాంక్ క్లర్క్, UNION BANK LBO, IBPS PO, IDBI ఎగ్జిక్యూటివ్ పరీక్షల్లోనూ సత్తాచాటారు. దీనిపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News November 10, 2025
భద్రాచలంలో భక్తుల రద్దీ

భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయం ఆదివారం, సోమవారం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం కావడం, వరుస సెలవు దినాలు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో భద్రాద్రికి తరలివచ్చారు. ఆదివారం ఉదయం నుంచి రామాలయంలోని క్యూలైన్‌లో కిక్కిరిశాయి. ఉచిత దర్శనానికి రెండు గంటలు, శీఘ్ర దర్శనానికి ఒక గంట సమయం పట్టింది. భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు ముందస్తుగా ఏర్పాట్లు చేశారు.
News November 10, 2025
చిత్తూరు పోలీసులకు 43 ఫిర్యాదులు

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. బాధితుల నుంచి ఎస్పీ తుషార్ డూడీ వినతులు స్వీకరించారు. 43 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. చట్ట ప్రకారం వాటిని విచారించి బాధితులకు సత్వరమే న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు.
News November 10, 2025
KNR: ఫుడ్ పాయిజన్ ఘటనపై బండి సంజయ్ ఆరా

జమ్మికుంట ప్రాథమిక పాఠశాలలో జరిగిన <<18250681>>ఫుడ్ పాయిజన్ ఘటన<<>>పై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి ఆయన ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆమెను అడిగి తెలుసుకున్నారు. కాగా, ప్రస్తుతం పిల్లల ఆరోగ్యం నిలకడగానే ఉందని కలెక్టర్ మంత్రికి వివరించారు. మెరుగైన చికిత్స కోసం KNR ఆసుపత్రికి తరలించాలన్నారు.


