News May 24, 2024

5 నుంచి బీఈడీ, ఎంఈడీ పరీక్షలు ప్రారంభం

image

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో బీఈడీ, ఎంఈడీ ప్రథమ సెమిస్టర్ పరీక్షలు (రెగ్యులర్, బ్యాక్ లాగ్) జూన్ 5 నుంచి, ఎంఈడీ థర్డ్ సెమిస్టర్ పరీక్షలు జూన్ 6 నుంచి ప్రారంభమవుతున్నట్లు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ ప్రకటనలో తెలిపారు. అలాగే LLB, ఎల్ఎల్ఎం ప్రథమ సెమిస్టర్ పరీక్షలు జూన్ 5 నుంచి ప్రారంభం అవుతున్నట్లు తెలిపారు.

Similar News

News December 14, 2025

కరీంనగర్ జిల్లాలో 111 గ్రామాల్లో పోలింగ్

image

కరీంనగర్ జిల్లాలో నేడు రెండవ దశ గ్రామపంచాయతీ ఎన్నికలు.మానకొండూర్ నియోజకవర్గంలోని 113 గ్రామాలకు గాను రెండు ఏకగ్రీవం కాగా, 111 గ్రామాలకు పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 1046 వార్డుల్లో 197 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 849 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ బరిలో 436 మంది, వార్డు సభ్యులుగా 2275 మంది ఉన్నారు. 1,84,761 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

News December 13, 2025

రెండో దశ ఎన్నికలు జరిగే ప్రాంతాలను పరిశీలించిన KNR సీపీ

image

కరీంనగర్ జిల్లాలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచామని, అన్ని పోలింగ్ కేంద్రాలను సీసీ టీవీ కెమెరాలు, వీడియో రికార్డింగ్ ద్వారా పర్యవేక్షించనున్నట్లు ఆయన తెలిపారు.

News December 13, 2025

ఇందుర్తి: ప్రచారం ముగిసినా ఆన్‌లైన్ పోల్.. కేసు నమోదు

image

చిగురుమామిడి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం గడువు ముగిసిన తర్వాత కూడా ఇన్‌స్టాగ్రామ్‌‌లో ‘మాక్ పోల్’ నిర్వహించిన ఘటనపై కేసు నమోదైంది. ఇందుర్తి గ్రామంలోని సర్పంచ్ అభ్యర్థుల పేర్లతో పోల్ నిర్వహించడం ద్వారా ఎన్నికల నిబంధనలు (MCC) ఉల్లంఘించారని మండల నోడల్ అధికారి ఫిర్యాదు చేశారు. చిగురుమామిడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.