News August 3, 2024
5 నుంచి స్వచ్ఛదనం-పచ్చదనం: కలెక్టర్

ఈనెల 5 నుండి 9 వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలలో నిర్వహించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన NLG నుండి మండల స్థాయి అధికారులతో స్వచ్ఛదనం పచ్చదనం పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత, మొక్కలు నాటడం, తాగునీరు, వివిధ సంస్థల పరిశుభ్రత, వీధికుక్కల బెడద తగ్గించడం వంటి అంశాలను చేపట్టాలన్నారు.
Similar News
News December 17, 2025
నల్గొండ జిల్లాలో తొలి సర్పంచ్ ఫలితం

నేరేడుగొమ్ము మండల పరిధిలోని 21 గ్రామపంచాయతీలకు సర్పంచ్ ఎలక్షన్లు ప్రశాంతంగా ముగిశాయి. చిన్నమునిగల్ గ్రామపంచాయతీలో మొదటి ఫలితం వెలువడింది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఇస్లావత్ వెంకటేశ్వర్లు విజయం సాధించారు. ఆయన బాబుపై 102 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
News December 17, 2025
నల్గొండ: ఆ గ్రామ పంచాయతీల్లో దంపతులదే హవా..!

తిప్పర్తి మండలంలోని 4 గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో దంపతుల హవా కొనసాగింది. రెండో దశ ఎన్నికల్లో 2019లో సోమోరిగూడెంలో కోన రజిత గెలవగా, ప్రస్తుతం ఆమె భర్త కోన వెంకన్న, రామలింగాల గూడెంలో ముత్తినేని శ్రీదేవి, ప్రస్తుతం ఆమె భర్త శ్యాంసుందర్, ఎర్రగడ్డలగూడెంలో ఎల్లాంల శైలజ, ప్రస్తుతం ఆమె భర్త సతీష్ రెడ్డి, జొన్నలగడ్డ గూడెంలో నామిరెడ్డి వెంకటరామిరెడ్డి, ప్రస్తుతం ఆయన భార్య అనురాధ విజయం సాధించారు.
News December 17, 2025
నల్గొండ: ఓట్ల కోసం నోట్ల వరద.. రూ.కోట్లలో ఖర్చు

నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో డబ్బు ప్రవాహం హద్దులు దాటిందని ప్రజలు అంటున్నారు. ఓటుకు రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు పంపిణీ చేసినట్లు సమాచారం. చిన్న పంచాయతీల్లో రూ.20 లక్షలకు పైగా ఖర్చు చేయగా, కీలక పంచాయతీల్లో అభ్యర్థులు రూ.కోటికి మించి పంపిణీ చేశారన్నారు. గెలిచినవారితో పాటు ఓడినవారు కూడా ఖర్చును తలచుకుని మదనపడుతున్నారు. క్రాస్ ఓటింగ్‌తో లెక్కింపు ఉత్కంఠగా మారింది.


