News November 21, 2024
5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యం: లోకేశ్
5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పని చేస్తున్నట్లు మంత్రి లోకేశ్ అసెంబ్లీలో తెలిపారు. ఈ లక్ష్యం చేరుకోవాలంటే 164 మంది ఎన్డీఏ ఎమ్మెల్యేలు సహకరించాలని కోరారు. విశాఖ ఐటీ హిల్స్‌పై రాబోయే 3 నెలల్లో రెండు ఐటీ కంపెనీలతో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. నిక్సీతో పాటు సింగపూర్ నుంచి సీ లైనింగ్ కేబుల్‌ను విశాఖకు తీసుకొచ్చే బాధ్యతను వ్యక్తిగతంగా తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
Similar News
News December 3, 2024
పూసపాటిరేగ: డమ్మీ సర్పంచ్‌పై సర్పంచ్ ఫిర్యాదు
తానే గ్రామానికి సర్పంచ్‌ను అంటూ అధికారులను, ప్రజా ప్రతినిధులను మోసం చేస్తున్నాడని టీడీపీ నాయకుడు దల్లి ముత్యాలరెడ్డిపై కుమిలి సర్పంచ్ మామిడి అప్పయ్యమ్మ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పూసపాటిరేగ ఎంపీడీవో రాధికకు ఆమె వినతిపత్రం సమర్పించారు. సర్పంచ్ అంటూ చెప్పుకుంటూ తిరగడమే కాకుండా లెటర్ ప్యాడ్‌పై కూడా సర్పంచ్ గానే ముద్రించి అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు.
News December 3, 2024
VZM: వినతులు సరే.. స్పందన వస్తుందా?
ప్రజా పరిష్కార వేదికకు పెద్ద ఎత్తున బాధితులు క్యూ కడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి బాధితులు రావడానికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మండల కార్యాలయాల్లో కూడా వినతులు స్వీకరిస్తున్నారు. భూసమస్యలపై అధిక ఫిర్యాదులు వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. నిన్న విజయనగరం కలెక్టరేట్‌కు 116 వినుతులు రాగా.. పార్వతీపురం మన్యం జిల్లాలో 108మంది అర్జీలు అందజేశారు. మరి మీ సమస్యకు అధికారులు పరిష్కారం చూపిస్తున్నారా?
News December 2, 2024
ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు: మంత్రి
రాష్ట్రంలోనే మొదటి <<14768413>>DSC ఫ్రీ కోచింగ్ సెంటర్<<>>ను పార్వతీపురంలో మొదలు పెట్టామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సీతంపేట ఐటీడీఏలో కూడా కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. మొత్తం 236 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో ST-144 SC-44,BC-42, ఐదుగురు ఓసీలు అప్లే చేసుకున్నారని వెల్లడించారు. ఇంకా ఎవరైనా ఆసక్తి గల వారు ఉంటే వారికి కూడా ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.