News November 10, 2024

5 రోజులు.. రూ.20,000 కోట్లు వెనక్కి

image

భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. చివరి 5 సెషన్లలోనే FPIలు రూ.20,000 కోట్లను వెనక్కి తీసుకున్నారు. ఈ డబ్బును ఎక్కువగా చైనా స్టాక్స్, US బాండ్స్, బిట్‌కాయిన్లలో పెడుతున్నారు. భారత స్టాక్స్ విలువలు గణనీయంగా పెరగడం, ప్రస్తుతం కన్సాలిడేషన్ దశకు చేరుకోవడం, చైనాలో స్టిములేషన్ స్కీమ్స్ అమలు ఇందుకు కారణాలు. Q3 రిజల్ట్స్ టైమ్‌లోFPIలు మళ్లీ తిరిగొస్తారని నిపుణుల అంచనా.

Similar News

News November 4, 2025

అన్నమయ్య: చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు మృతి

image

పెనగలూరు మండలం తిరునంపల్లి గ్రామం సమీపంలోని గుంజనేరు వద్ద విషాదం నెలకొంది. చేపలు పట్టడానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు నీట మునిగి మృతి చెందారు. మృతులు శీను (47), మల్లికార్జున (37)గా స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాలను బయటకు తీసి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News November 4, 2025

సైన్యాన్ని కూడా ఆ 10% మందే నియంత్రిస్తున్నారు: రాహుల్

image

బిహార్ ఎన్నికల ప్రచారంలో CONG నేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్లపై దుమారం రేగుతోంది. ‘దేశంలోని 10% జనాభాకే (అగ్రవర్ణాలు) కార్పొరేట్ సెక్టార్, బ్యూరోక్రసీ, జుడీషియరీలో అవకాశాలు దక్కుతున్నాయి. చివరకు ఆర్మీ కూడా వారి కంట్రోల్‌లోనే ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. 90% ఉన్న SC, ST, BC, మైనారిటీలు కనిపించరని పేర్కొన్నారు. కాగా భారత సైనికుల్ని చైనా సైన్యం కొడుతోందని ఇదివరకు RG కామెంట్ చేయగా SC మందలించింది.

News November 4, 2025

స్పోర్ట్స్ రౌండప్

image

✒ మోకాలి గాయంతో బిగ్‌బాష్ లీగ్‌ సీజన్‌-15కు అశ్విన్ దూరం
✒ రంజీ ట్రోఫీ: రాజస్థాన్‌పై 156 రన్స్ చేసిన ముంబై బ్యాటర్ యశస్వీ జైస్వాల్
✒ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్: IND-A కెప్టెన్‌గా జితేశ్ శర్మ, జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు
✒ ICC ఉమెన్స్ ODI బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నం.1గా లారా వోల్వార్డ్ట్.. రెండో స్థానానికి చేరిన స్మృతి మంధాన
✒ U19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీకి ఎంపికైన ద్రవిడ్ కుమారుడు అన్వయ్