News July 6, 2024
ఇకపై ఈవీ ఛార్జ్కు 5 నిమిషాలే!

గంటల పాటు వేచి చూడనవసరం లేకుండా 5 నిమిషాల్లోనే ఈవీ బ్యాటరీ ఛార్జ్ అయ్యే టెక్నాలజీ త్వరలో అందుబాటులోకి రానుంది. నైబోల్ట్ అనే యూకే సంస్థ 4.5 నిమిషాల్లో 70% ఛార్జ్ అయ్యే కారును రూపొందించింది. దీని కోసం ప్రత్యేకంగా 35కిలోవాట్ల లిథియమ్ అయాన్ బ్యాటరీని డిజైన్ చేసింది. మరోవైపు న్యూయార్క్లోని కార్నెల్ యూనివర్సిటీ కొన్ని నెలల క్రితం 5 నిమిషాల్లో ఛార్జ్ అయ్యే బ్యాటరీని డిజైన్ చేసింది.
Similar News
News January 26, 2026
ప.గో: జిల్లాలో పెరిగిన మార్కెట్ విలువలు

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2026వ సంవత్సర మార్కెట్ విలువలను పెంచుతూ ఉత్తర్వలు జారీచేసింది. ఫిబ్రవరి 1 నుంచి మార్కెట్ విలువలు పెరుగుతాయని జిల్లా రిజిస్టర్ శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. 0 నుంచి 25% వరకు మార్కెట్ విలువలు పెరిగాయని జిల్లాలోని 15 సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అన్నారు.
News January 26, 2026
ఇంట్లో ఫారిన్ కరెన్సీ ఎంత ఉంచుకోవచ్చు?

ఇంట్లో విదేశీ కరెన్సీ నోట్లు ఉంచుకోవడానికి పరిమితి ఉంది. RBI&FEMA నిబంధనల ప్రకారం ఎలాంటి కాల పరిమితి లేకుండా USD 2,000 (లేదా దానికి సమానమైన విదేశీ కరెన్సీ) నోట్లు, ట్రావెలర్స్ చెక్స్ ఉంచుకోవచ్చు. ఒకవేళ అంతకు మించితే 180 రోజుల్లోగా అధికారిక డీలర్(బ్యాంక్) ద్వారా సరెండర్ చేయాలి లేదా RFC అకౌంట్లో జమ చేయాలి. విదేశీ నాణేలపై ఎలాంటి పరిమితి లేదు. అన్లిమిటెడ్గా ఉంచుకోవచ్చు.
News January 26, 2026
అమెరికాకు చైనా అణు రహస్యాలు లీక్?

చైనా మిలిటరీ ఆఫీసర్ జనరల్ జాంగ్ యూక్సియా తమ దేశ అణు ఆయుధాల టెక్నికల్ డేటాను USకి లీక్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నారని, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. దీనిపై చైనా రక్షణ శాఖ విచారణ జరుపుతున్నట్లు సమాచారం. షీ జిన్పింగ్కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన జాంగ్ యూక్సియాపై ఇలాంటి ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.


