News July 1, 2024

మేధాపాట్కర్‌కు 5 నెలల జైలుశిక్ష

image

24 ఏళ్ల క్రితం నాటి పరువునష్టం కేసులో ప్రముఖ సామాజిక కార్యకర్త మేధాపాట్కర్‌కు ఢిల్లీ కోర్టు 5నెలల జైలుశిక్ష విధించింది. నర్మదా బచావో ఆందోళన సమయంలో ఆమె తనను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా 2002లో పరువునష్టం దావా వేశారు. తాజాగా కోర్టు మేధాపాట్కర్‌కు 5నెలలు జైలుశిక్ష విధించింది. అలాగే సక్సేనాకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆమెకు సూచించింది.

Similar News

News April 18, 2026

జియో IPO.. టార్గెట్ రూ.50,000కోట్లు!

image

రిలయన్స్ జియో త్వరలో ఐపీఓకు రానున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో సెబీకి ఐపీవో పత్రాలను సమర్పించనుంది. సుమారు రూ.40,000-50,000కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఇదే జరిగితే దేశంలో అతిపెద్ద ఐపీఓగా రికార్డ్ నెలకొల్పనుంది. IPO నిర్వహణ కోసం 17 మర్చంట్ బ్యాంకింగ్ సంస్థలను జియో నియమించుకుంది. సంస్థ మార్కెట్ వాల్యూ రూ.16.72లక్షల కోట్లు కాగా ఇందులో 2.5% వాటా విక్రయించాలని యోచిస్తున్నట్లు సమాచారం.

News April 18, 2026

‘మే’లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు?

image

తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి మొదలు కానుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ కోసం ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నెల 23లోపు ముసాయిదా జాబితా సిద్ధం చేసి అనంతరం విడుదల చేయనుంది. దీంతో వచ్చే నెలలో ఎలక్షన్స్ జరిగే అవకాశం కనిపిస్తోంది. కాగా గతేడాది జూన్‌తో ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం ముగిసింది. ఇక రాష్ట్రంలో ఇటీవల సర్పంచ్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

News April 18, 2026

సోమవారం రెండో విడత శాంతి చర్చలు!

image

అమెరికా-ఇరాన్ రెండో విడత శాంతి చర్చలకు సిద్ధమయ్యాయి. అందుకు మరోసారి పాకిస్థాన్‌ను వేదికగా ఎంచుకున్నాయి. ఇస్లామాబాద్‌లో వచ్చే సోమవారం చర్చలు జరపనున్నట్లు సమాచారం. రేపు ఇరాన్ ప్రతినిధులు పాక్ చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తొలి విడత చర్చలు విఫలమైన విషయం తెలిసిందే.